శ్రీలంక టూరిజంపై టెర్రర్ దెబ్బ : రూ.10వేల కోట్ల నష్టం

శ్రీలంక టూరిజంపై టెర్రర్ దెబ్బ : రూ.10వేల కోట్ల నష్టం

ఉగ్రవాదుల దాడుల నుంచి శ్రీలంక ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గత ఆదివారం ఏప్రిల్ 21 నాడు కొలంబో, దాని పరిసర పట్టణాల్లో 3 చర్చ్ లు, 3 లగ్జరీ హోటళ్లలో 8 బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ బాంబు పేలుళ్లలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. పేలుళ్లలో 253 మంది చనిపోయినట్టు ఆ దేశం అధికారికంగా గురువారం ప్రకటించింది.

ఉగ్రవాదుల దాడిలో ప్రాణ నష్టం ఆ దేశ చరిత్రలోనే పెను విషాదంగా నమోదైంది. ఆర్థికంగానూ ఆ దేశాన్ని భారీగా దెబ్బకొట్టింది. ఆ దేశ టూరిజానికి భారీగా నష్టం వాటిల్లినట్టు అంచనాలు చెబుతున్నాయి. శ్రీలంక పర్యాటకానికి 1.5 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో… 10వేల 550 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. శ్రీలంకకు ఆదాయం ఎక్కువగా పర్యాటకం నుంచే వస్తుంది.