
హైదరాబాద్, వెలుగు: కల్యాణలక్ష్మికి ప్రభుత్వం రూ.725 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను 2024–25 ఆర్థిక సంవత్సరానికి కేటాయిస్తూ అప్రూవల్ ఇచ్చింది. ఈ మేరకు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం జీవో విడుదల చేశారు. దీంతో పెండింగ్ లో ఉన్న కల్యాణలక్ష్మి అప్లికేషన్లు క్లియర్ కానున్నాయి. కాగా, కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది. ఇందుకోసమే నిధులు మంజూరు చేసినట్టు తెలుస్తున్నది.