శ్రీనగర్ కు 10 వేల మంది సైనికులు

శ్రీనగర్ కు 10 వేల మంది సైనికులు

వేర్పాటువాదుల్ని తుదముట్టిం చేందుకు కేంద్రం యాక్షన్​ప్లాన్​

పుల్వామా ఘటన తర్వాత కాశ్మీర్‌‌లోయలో టెర్రరిస్టుల్ని ఏరేసేం దుకు ఇండియా పక్కా యాక్షన్‌‌ ప్లాన్‌‌తో రెడీ అయింది. వేర్పాటువాద నేత, జమ్ము కాశ్మీర్‌‌ లిబరేషన్‌‌ ఫ్రంట్‌‌ ప్రెసిడెంట్‌‌  యాసిన్‌‌ మాలిక్‌‌, జమాతే-ఇ- ఇస్లామ్‌ (కాశ్మీర్‌‌) చీఫ్‌‌ అబ్దుల్‌‌ హమీద్‌‌ ఫయాజ్‌ తో పాటు సుమారు 130 మంది సెపరెటిస్టుల్ ని శుక్రవారం రాత్రే అరెస్టు చేసిం ది. ఈనేపథ్యం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా బలగాలను పెద్దఎత్తున మోహరిం చారు. శుక్రవారం రాత్రి దాదాపు 10 వేల మంది పారామిలటరీ సిబ్బందిని ( 100 కంపెనీలు ) శ్రీనగర్‌‌కు ఎయిర్‌‌ లిఫ్ట్ లో తరలించిం ది. కేం ద్ర హోం శాఖ ‘ ఎమర్జీన్సీ’ నోటీసులు ఇష్యూ చేయడంతో ఎకాఎకిన ఈ పారామిలటరీ కంపెనీలను శ్రీనగర్‌‌కు పంపిం చారు. పారామిలటరీ ఫోర్స్‌‌తో పాటు జమ్మూకాశ్మీర్‌‌ పోలీసులు,ఇప్పుడు ఆ రాష్ట్రం లో ఉన్న క్యూరిటీ ఫోర్స్‌‌ మరికొన్నిరోజులపాటు అక్కడే ఉంటాయని హోంశాఖ వర్గాలు చెప్పాయి.పారామిలటరీ ఫోర్స్‌‌ భాషలో ‘కంపెనీ’లో 80 నుం చి 150 మందివరకు సోల్జర్ లు ఉంటారు. రాష్ట్రం లో దిం పిన బలగాల్లో 45 కంపెనీల సీఆర్పీఎఫ్‌‌, బీఎస్‌‌ఎఫ్‌‌ 35, శసస్త్ర సీమా బల్‌‌, ఇండో టిబిటెన్‌‌ బోర్డర్‌‌ కు చెం దిన చెరి 10 కంపెనీలు ఉన్నా యి.

పుల్వామాలో 40 మంది జవాన్లు చనిపోయిన తర్వాత జమ్మూకాశ్మీర్‌‌ అంతటా కేం ద్ర బలగాలు దిగాయి. ఈఘటన తర్వాత రాష్ట్రం లో ముఖ్యం గా కాశ్మీర్‌‌ లోయలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆ తర్వాత ఆర్మీ ఆపరేషన్లో.. పుల్వామా సూత్రధారి, ముగ్గు రు జైషే

ఎన్​సీ నిరసన ర్యాలీ…

దేశంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న కాశ్మీరీలపై దాడులకు పాల్పడడం హేయమంటూ ఎన్సీ ప్రధాన కార్యదర్శి అలీ మొహమ్మద్ సాగర్ విమర్శించారు. దీనికి నిరసనగా శనివారం ఆయన శ్రీనగర్ లో ర్యా లీ నిర్వహిం చారు. కాశ్మీరీలను వేధిం చొద్దం టూ నినాదాలు చేశారు. దాడులను ఆపేయాలని డిమాం డ్ చేశారు. పార్టీ హెడ్ క్ వార్టర్స్ నుంచి మొదలైన ఈ ర్యాలీ టీఆర్ సీ క్రాసిం గ్ దగ్గర ముగిసింది. అక్కడ పెద్ద ఎత్తున మొహరించిన పోలీసులు ఈ ర్యాలీని నిలువరించారు. తర్వాత వి లేకరులతో మాట్లాడుతూ.. ఇతర సిటీల్లో ఉంటున్న కాశ్మీరీలను టార్గెట్ గా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని సాగర్ విమర్శించారు. ఏ నగరంలో ఉన్నా మేం ఇండియన్స్ మే కదా.. చదువుకోసం వెళ్లిన స్టూ డెంట్లను టార్గెట్ గా చేయడమేంటి? అని నిలదీశారు.