ఓవర్ త్రో 4పై జీవితాంతం క్షమాపణ అడుగుతా : స్టోక్స్

ఓవర్ త్రో 4పై జీవితాంతం క్షమాపణ అడుగుతా : స్టోక్స్

ఓవర్ త్రో 4పై జీవితాతం క్షమాపణ అడుగుతా : ఇంగ్లండ్ హీరో స్టోక్స్

లార్డ్స్ : వరల్డ్ కప్ 2019 ఫైనల్ ఎలా జరిగిందన్నదే ఇపుడు క్రికెట్ ప్రపంచమంతటా హాట్ టాపిక్. మ్యాచ్ క్లైమాక్స్.. ఆ తర్వాత సూపర్ ఓవర్.. ఇలా.. రెండూ కూడా టై కావడంతో… ఇది క్రికెట్ లోనే అరుదైన విషయంగా చెప్పుకుంటున్నారు. ఐతే… ఇంగ్లండ్ కు వరల్డ్ కప్ తెచ్చిపెట్టడంలో ఆ జట్టు మేటి ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పాత్ర చాలా కీలకం. అతడే ఆ జట్టు హీరో. వికెట్లు పడిపోయి లోకల్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు మ్యాచ్ ను చివరిదాకా తీసుకొచ్చాడు. టై అయిందంటే అది కూడా స్టోక్స్ వల్లే. గప్తిల్ వికెట్ల వైపు విసిరిన బంతి… స్టోక్స్ బ్యాట్ ను తాకి.. మళ్లీ బౌండరీకి వెళ్లింది. అలా 6 పరుగులు వచ్చాయి. ఎక్స్ ట్రాగా వచ్చిన ఈ 4 రన్స్ కారణంగానే.. ఫైనల్ మ్యాచ్ టై అయింది.

బాల్ తన బ్యాట్ ను తగిలి.. బౌండరీకి వెళ్లడంపై స్టోక్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తంచేశాడు. తానేమీ చేయలేదన్నట్టుగా రెండు చేతులు పైకి లేపి అంపైర్లకు చూపించాడు. రూల్స్ ప్రకారం.. ఆరు పరుగులొచ్చాయి. ఐతే… దీనిపై ఆ తర్వాత స్టోక్స్ మాట్లాడాడు. రనౌట్ నుంచి తప్పించుకునేందుకే బ్యాట్ ను ముందుకు సాచి.. క్రీజువైపు దూసుకుపోయాననీ.. ఈ టైమ్ లో బాల్ తన బ్యాట్ ను తగిలిందని చెప్పాడు. ఆ ఫోర్ మ్యాచ్ టై కావడంలో కీలకంగా మారిందన్న సంగతి.. మ్యాచ్ పూర్తయ్యాకే అందరికీ తెలిసిందన్నాడు. అప్పటికే.. తాను కేన్ విలియంసన్ కు సారీ చెప్పాననీ.. గుర్తుచేశాడు బెన్ స్టోక్స్.

తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్ కు దిగి.. వికెట్ల పతనం ఆపి.. ఇంగ్లండ్ ను గెలుపుదాకా తీసుకొచ్చి .. టై కావడానికి ప్రధాన కారణమై… సూపర్ ఓవర్ లో 1 బౌండరీతో 9 రన్స్ చేసిన  స్టోక్స్ పోరాటాన్ని ఇంగ్లండ్ ఎంత పొగిడినా తక్కువే. అందుకే.. అతడే రియల్ హీరో అని ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ చెప్పాడు.