వీళ్లకు కారు లేదా.. లిస్ట్ చూస్తే మీరు అవాక్కవుతారు.. అవును నిజం..!

వీళ్లకు కారు లేదా.. లిస్ట్ చూస్తే మీరు అవాక్కవుతారు.. అవును నిజం..!

నరేంద్ర మోదీ.. దేశానికి ప్రధాని.. అతనికి కారు లేదు.. అమిత్ షా.. దేశానికి హోం మంత్రి కోట్ల రూపాయల ఆస్తులు చూపించారు.. సొంత కారు కూడా లేదు.. అంతేనా.. ఎన్నికల బరిలో నిలిచిన ఎంతో మంది హేమాహేమీలకు.. వందల కోట్లు ఆస్తి చూపించిన మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, దేశానికి కేంద్ర మంత్రులుగా చేసిన వారికి సొంత కారు లేకపోవటం చూసి దేశ ప్రజలు అవాక్కవుతున్నారు.. నిజం.. అమ్మతోడు ఈ కింద లిస్టు చూస్తే మీరు షాక్ అవుతారు.. వీళ్లలో ఎవరికీ కారు లేదు. 

 మోదీ  :  వారణాసి స్థానం నుంచి హ్యాట్రిక్ విజయం కోసం ప్రధాని మోదీ మే 14వ తేదీ మంగళవారం నామినేషన్‌ను దాఖలు చేశారు. మోదీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, ఆయన వద్ద మొత్తం రూ. 3 కోట్లు ఆస్తులు ఉన్నాయి. అయితే భూమి, ఇళ్లు, కార్లు లేవు.


అమిత్ షా :  గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఆయన  ఎన్నికల అఫిడవిట్ ప్రకారం  ఆస్తుల విలువ రూ. 36 కోట్లుగా ప్రకటించారు. తన భార్య సోనాల్ షా ఆస్తులు రూ. 31 కోట్లుగా తెలిపారు. కానీ అమిత్ షాకు సొంతగా కారు లేదు.  
రాజ్‌నాథ్ సింగ్ :  లక్నో లోక్‌సభ స్థానం నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 6.36 కోట్లు. ఆయన  వద్ద రివాల్వర్, డబుల్ బ్యారెల్ తుపాకీ ఉన్నప్పటికీ స్వంత కారు మాత్రం లేదు.


రాహుల్ గాంధీ :  కేరళలోని వాయనాడ్‌, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌  అగ్రనేత రాహుల్‌ గాంధీ తన ఆస్తుల విలువ రూ. 20 కోట్లు అయితే ఆయనకు సొంతగా కారు,ఫ్లాట్  లేదు.
అఖిలేష్ యాదవ్ :  ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆస్తుల విలువ రూ. 26.34 కోట్లు..  కానీ ఆయనకు సొంత కారు లేదు.
హెచ్‌డి కుమారస్వామి  :  జేడీ(ఎస్) చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి  మండ్యా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తన  భార్య అనితతో కలిసి మొత్తం ఆస్తులు రూ. 217.21 కోట్లుగా ప్రకటించారు. తన వద్ద ట్రాక్టర్ ఉన్నప్పటికీ, కారు లేదని అఫిడవిట్ లో తెలిపారు .
శివరాజ్ సింగ్ చౌహాన్ :  విదిశా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎ  శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్నికల అఫిడవిట్ లో  తన ఆస్తుల విలువ రూ. 3.21 కోట్లుగా తెలిపారు. కానీ ఆయనకు కారు లేకపోగా, ఆయన భార్యకు అంబాసిడర్ కారు ఉంది. 
అసదుద్దీన్ ఒవైసీ :  తెలంగాణలోని హైదరాబాద్ స్థానం నుంచి ఐదోసారి ఎంపీగా పోటీ చేస్తున్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ  తన ఆస్తుల విలువ రూ. 23 కోట్లగా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. కానీ ఆయనకు సొంతగా కారు లేదు.  


కొంపెల్లి మాధవి లత :  అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేసిన బీజేపీ నేత కొంపెల్లి మాధవి లత, రాష్ట్రంలోని అత్యంత సంపన్న అభ్యర్థులలో ఒకరుగా  నిలిచారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమెకు సొంతంగా కారు కూడా లేదు. కానీ ఆమె ఆస్తులు  రూ. 220 కోట్లు.