రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

 రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా:  సీఎం రేవంత్ రెడ్డి

రైతు రుణమాఫీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. SLBC మీటింగ్ పెట్టి.. రైతుల రుణాలకు సర్కార్ గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తామన్నారు సీఎం. మే13వ తేదీ మంగళవారం లోక్ సభ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు.

ధరణిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రేవంత్. కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు. అఖిలపక్షం పెట్టి..రైతుల సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యంతోపాటు..మరికొన్ని సరుకులు ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. రేపటి నుంచి పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టిపెడతానన్నారు. రైతు రుణమాఫీ, సమస్యలు, విద్యా సంవత్సరం మొదలు కానుండటంతో సన్నబియ్యం సరఫరా, పుస్తకాలు, యూనిఫాం పంపిణీపై సమీక్షిస్తానన్నారు రేవంత్.