Sachin Tendulkar: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని.. సచిన్‌ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య

Sachin Tendulkar: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని.. సచిన్‌ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య

భారత క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ భద్రతకు రక్షణగా నిలుస్తున్న ఒక జవాన్ సర్వీస్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడిని స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(SRPF)కు చెందిన ప్రకాష్ కప్డే(39)గా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలోని జామ్నెర్‌ పట్టణంలోని అతని పూర్వీకుల స్వస్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, స్టేట్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్ లు చెందిన జవాన్ ప్రకాశ్‌ కాప్డే.. సచిన్‌ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతను కొన్ని రోజులు క్రితం సెలవు తీసుకొని తన స్వగ్రామానికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అక్కడే అతను తన సర్వీస్ తుపాకీతో మెడపై కాల్చుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో అతని కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు.  

Also Read:23 రోజులు.. 2100 KM ప్రయాణం.. ధోని కలిసేందుకు అభిమాని సాహసం

వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చుని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. పొరపాటున పేలిందా..! లేదా అతనే కాల్చుకున్నాడా..! లేదా మరొకరి ప్రేమయం ఏమైనా ఉందా..! ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు, కాప్డే వీవీఐపీ సెక్యూరిటీలోని గార్డు కావడంతో.. ఈ ఘటనపై ఎస్ఆర్‌పీఎఫ్‌ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించనుందని సమాచారం.