Sanju Samson: సంజుతో ఎవరిని పోల్చలేం.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sanju Samson: సంజుతో ఎవరిని పోల్చలేం.. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sanju Samson: మార్చి 28న ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ సైతం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఈసారి ట్రోఫీనే టార్గెట్ గా బరిలోకి దిగుతుంది ఈ టీమ్. రాజస్థాన్ కి చాలా కాలం పాటు ఆడిన సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కు  ట్రేడింగ్ కావడంతో పాటు సీఎస్కే నుంచి సామ్ కరాన్, రవీంద్ర జడేజాలు వచ్చారు. ఈ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మీడియాతో మాట్లాడుతూ.. “సంజు శాంసన్ ఆట ప్రత్యేకం, అతడితో ఎవరితో పోల్చలేమన్నారు. ప్రతి ఆటగాడు గెలిచేందుకు ఆడతాడని పేర్కొన్నారు. ఇక గత సీజన్లో చివరి దశలో మేము కొంచెం స్వేచ్ఛగా ఆడి ఉంటే, కచ్చితంగా టోర్నీలో మరింత ముందుకు వెళ్లే వాళ్లం.. ఈసారి ఆ తప్పులను సరిదిద్దుకుంటున్నామని పరాగ్ వెల్లడించారు. 
 
టీమ్ లో స్పిన్, ఫాస్ట్ బౌలర్ల సమతుల్యత ఉంది.. బ్యాటింగ్‌లో రైట్-హ్యాండ్, లెఫ్ట్-హ్యాండ్ బ్యాట్స్‌ల సమతుల్యత ఉండటంతో ఈసారి మా దగ్గర స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ ఉందని రియాన్ పరాగ్ చెప్పారు. రవీంద్ర జడేజాపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.. హోమ్ గ్రౌండ్‌లో ఆడడంపై ఎక్కువ ప్రభావం ఉండదన్నారు. స్టేడియం ఏదైనా ఈసారి దుమ్మురేపి మాత్రం రాజస్థాన్ రాయల్స్ జట్టే అని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది అభిమానులు చీర్ చేస్తారు, మరీ  కొందరు ప్రత్యర్థులను గేలి చేస్తారు.. కానీ మేము డిస్ట్రాక్షన్స్‌ నుంచి దూరంగా, మా ఆటపై దృష్టి పెడతామని తెలిపారు. మా లక్ష్యం ఒక్కటే ఈ టోర్నీలో బలమైన ప్రదర్శన ఇవ్వడమేనని పరాగ్ పేర్కొన్నారు.  

జడేజా అద్భుతమైన ఆల్‌రౌండర్, ఆయనపై జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుందని రియాన్ పరాగ్ అన్నారు. మ్యాచ్ పరిస్థితుల ప్రకారం, కష్ట సమయాల్లో వీటిని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతామన్నారు. వైభవ్ సూర్యవంశీపై హెడ్ కోచ్ కుమార్ సంగక్కారా విశ్వాసం పెట్టుకున్నారు.. అతను యంగ్ క్రికెటర్ జస్ట్ 15, -16 ఏళ్ళలోనూ అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నాడు.. అతని కోసం ప్రత్యేక వ్యూహం రూపొందించామని చెప్పారు. ఇప్పటికే జట్టు ప్రిపరేషన్లు పూర్తి చేసింది.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ప్రతి అంశంపై దృష్టి పెట్టాం.. ప్రతీ రోజు బాగా ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్నామని రియాన్ చెప్పారు.  

►ALSO READ | Gautam Gambhir: ఢిల్లీ హైకోర్టుకు టీమిండియా హెడ్ కోచ్.. డీప్‌ఫేక్ వీడియోలపై గంభీర్ ఫైట్

IPLలో రాజస్థాన్ రాయల్స్ స్క్వాడ్:
రవీంద్ర జడేజా, సామ్ కరాన్, డొనోవన్ ఫెరేరా, సందీప్ శర్మ, శుభం డుబే, వైభవ్ సూర్యవంశీ, లుహాండ్రే ప్రిటోరియస్, షిమ్రాన్ హెట్మియర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యుధ్వీర్ సింగ్ చారక్, జోఫ్రాండ్ మాతృమూర్తి, జోఫ్రాండ్ ఆర్పాండ్, తుషార్నా రవి బిష్ణోయి, సుశాంత్ మిశ్రా, యష్ రాజ్ పుంజా, విఘ్నేష్ పుతూర్, రవి సింగ్, అమన్ రావ్, బ్రిజేష్ శర్మ, ఆడమ్ మిల్న్, కుల్దీప్ సేన్.