వందే భారత్ పై మళ్లీ దాడి.. బాధ్యులపై కఠిన చర్యలకు రంగం సిద్ధం

వందే భారత్ పై మళ్లీ దాడి.. బాధ్యులపై కఠిన చర్యలకు రంగం సిద్ధం

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఏప్రిల్ 5న  గుర్తు తెలిపయని వ్యక్తులు ట్రైన్ పైకి రాళ్లు విసరడంతో కోచ్ భాగం పాక్షికంగా ధ్వంసమైంది. గడిచిన మూడు నెలల్లో ఇటువంటి దాడులు జరగడం ఇది మూడో సారి కావడం గమనార్హం. 

‘‘కొందరు నడుస్తున్న ట్రైన్ పైకి రాళ్లు రువ్వారు. దీనికి సంబంధించిన మరమత్తులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగా గురువారం విశాఖ నుంచి ఉదయం 5:45 కు సికింద్రాబాద్ కు బయలు దేరాల్సిన ట్రైన్ 9:45 బయలుదేరాల్సి వస్తోంది. ఈ ఘటనలో సి8  బోగీ అద్దం పగిలింది.’’ అంటూ వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ఈ దాడికి పాల్పడిన వారి కోసం  రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) గాలిస్తోంది. ఈ దాడిలో పగిలిన కోచ్ అద్దం విలువ దాదాపు రూ. లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఇది ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిందితుల కోసం సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నాం. మరెవ్వరూ ఇటువంటి ఘటనలకు పాల్పడవద్దు అని కోరుతున్నాను’’ అంటూ డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్ కుమార్ తెలిపాడు.