జాత్యంహకార కామెంట్స్: ఇండోనేషియాలో స్టూడెంట్ల ఆందోళన

జాత్యంహకార కామెంట్స్: ఇండోనేషియాలో స్టూడెంట్ల ఆందోళన

జాత్యంహకార కామెంట్స్​కు నిరసనగా ఇండోనేషియాలోని పపువా రీజియన్​లో వందలాది స్టూడెంట్లు రోడ్డెక్కారు. వామెనా సిటీలో ప్రభుత్వ ఆఫీసులను, ఇతరత్రా బిల్డింగ్​లకు నిప్పంటించారు. చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, షాపులను తగులబెట్టారు. స్కూల్​లో ఓ టీచర్ జాత్యంహకార కామెంట్లు చేయడమే ఈ ఆందోళనలకు కారణమని పోలీసులు చెప్పారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వార్నింగ్​ షాట్స్​ ఫైర్​ చేశామన్నారు. వామెనా సిటీతో పాటు ఓ యూనివర్సిటీ దగ్గర్లో కూడా ఆందోళనలు చెలరేగాయని వివరించారు. పోలీసులు, సెక్యూరిటీ బలగాలపైకి ఆందోళనకారులు రాళ్లు విసిరారని చెప్పారు. ఈ ఆందోళనలలో పాల్గొన్న వారిలో ఎక్కువగా స్కూల్​విద్యార్థులే ఉన్నారన్నారు. వామెనా సిటీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, మరోసారి అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యగా ఇంటర్నెట్​ సర్వీసులను నిలిపేశామని పోలీసులు తెలిపారు.