వలస కూలీలను ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లో పంపాలి

వలస కూలీలను ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లో పంపాలి

లాక్ డౌన్ వల్ల పేద మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో పనిచేసే వలస కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. పూటగడవక తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. అటు సొంత ఊళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ ను పొడిగించడం వల్ల ఈ ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. రవాణా సౌకర్యం లేక కొంత మంది కూలీలు కాలి నడకన తమ సొంత ఊళ్లకు వెళుతున్నారు. మంగళవారం మహారాష్ట్రలోని ముంబై, థానేలో వలస కూలీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఉత్తర్‌‌ ప్రదేశ్‌, బీహార్‌‌, పశ్చిమబెంగాల్‌కు వెళ్లేందుకు ట్రైన్లు నడపాలని డిమాండ్‌ చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు వాళ్లపై లాఠీ చార్జ్‌ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారని 1000 మంది వలస కూలీలపై కేసు నమోదు చేశారు.

అయితే వలస కూలీలను తమ సొంత ఊళ్లకు తరలించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సాయంతో  ఆయా రాష్ట్రాలు తీసుకోవాలన్నారు  రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణియన్ స్వామి. బస్సుల ద్వారా కూలీలను తరలించాలన్నారు. 500కి.మీ కంటే ఎక్కువ దూరమున్న ప్రాంతాలకు ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా కూలీలను తరలించాలన్నారు.