ఈ సమ్మర్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ వెకేషన్స్ చేసేందుకు చిట్కాలు

ఈ సమ్మర్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ వెకేషన్స్ చేసేందుకు చిట్కాలు

కొత్త ప్రాంతాలను సందర్శించడానికి, బీచ్‌లో విశ్రాంతి తీసుకోవడానికి లేదా థ్రిల్లింగ్ అడ్వెంచర్‌లను ప్రారంభించడానికి వేసవి సరైన సమయం. ఇలాంటి పనులు చేయాలంటే ముందుగా మీరు ఖర్చులను పరిగణలోకి తీసుకుని సెలవులను ప్లాన్ చేసుకోవాలి. ప్రణాళికమైన బడ్జెట్‌తో వెళితే అద్భుతమైన వేసవి సెలవులను హాయిగా గడపవచ్చు. 

సమ్మర్ వెకేషన్ కు బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్లి రావాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలు.. 

బడ్జెట్ ప్లాన్ : 

ఏదైనా ప్రాంతానికి విజిట్ లేదా స్పెండ్ చేయడానికి వెళ్తున్నపుడు ముందుగా చేయాల్సిన పని బడ్జెట్ ను ప్లాన్ చేసుకోవడం. ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని టూర్ కు ఎంత మొత్తంలో ఖర్చవుతుందో ఆలోచించాలి. వసతి, రవాణా, కార్యకలాపాలు, భోజనం లాంటి  అన్ని ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్‌ను ప్లాన్ చేయడమే కాదు.. మనం అనుకున్న ప్లాన్ ను మీరకుండా పరిమితిలోనే టూర్ కంప్లీట్ చేయడం అంతకన్నా ముఖ్యం.

ప్రాంతానికి ప్రయాణ తేదీలు .. 

మనం చేసే చిన్న చిన్న తప్పుల్లో ఇది కూడా ఒకటి. ఏదైనా ప్లేస్ కి వెళ్లినపుడు అక్కడికి వెళ్లాలి, ఇక్కడికి వెళ్లాలని అక్కడికి వెళ్లాక ఆలోచించకుండా.. వెళ్లే ముందే ఏ తేదీ రోజు ఏ ప్రాంతానికి వెళ్లాలన్న విషయంపై క్లారిటీగా ఉండాలి. దాని వల్ల చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది. సమ్మర్ అంటే చాలా మంది ఎంజాయ్ చేయాలని చూసే టైం. హాలిడేస్ కు మంచి కాలం. కాబట్టి చాలా మంది ఇలాంటి టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ టైంలో విమానాలు, వసతి లాంటి వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. కాబట్టి తక్కువ జనాదరణ పొందిన ప్లేస్ లను ఎంచుకుంటే తక్కువ ఖర్చులోనే ఎంజాయ్ చేసి రావచ్చు.

ఖర్చులు తగ్గించుకోండి :

అనేక విమానయాన సంస్థలు, హోటళ్ళు, ట్రావెల్ ఏజెన్సీలు వేసవి నెలల్లో ప్రత్యేక ప్రమోషన్లు, తగ్గింపులను అందిస్తూ ఉంటాయి. విమానంలో ఫుడ్ ను కూడా అందించే ప్యాకేజీ డీల్‌ల కోసం చూడండి. అవి చాలా వరకు డబ్బును ఆదా చేస్తాయి. ప్రయాణానికి ముందే చీప్ గా వసతిని కల్పించే ప్యాకేజీలను బుక్ చేసుకోండి.

వసతి ఖర్చులను తగ్గించుకోండి :

వేసవి సెలవులను ప్లాన్ చేసేటప్పుడు అతి పెద్ద ఖర్చులలో ఒకటి అకామడేషన్ (వసతి) . డబ్బు ఆదా చేయడానికి వెకేషన్ రెంటల్స్, హాస్టల్స్ లేదా క్యాంపింగ్ వంటి ఆల్టర్ నేట్ ఆప్షన్స్ ను ఎంచుకోండి.  బడ్జెట్- ఫ్రెండ్లీ హోటల్‌లు లేదా అతిథి గృహాల కోసం చూడండి. ఇవి ప్రాథమిక సౌకర్యాలను అందిస్తాయి. కానీ మరింత సరసమైన ధరల్లోనే అందుబాటులోకి ఉంటాయి. 

భోజనం, ఇతర యాక్టివిటీస్ ను తెలివిగా ప్లాన్ చేయండి:

ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్తున్నపుడు ఫుట్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. లేదంటే పెద్దమొత్తంలో జేబుకు చిల్లు పడడం ఖాయం. అందుకోసం భోజనం, ఇతర కార్యకలాపాలను మీరే తెలివిగా ప్లాన్ చేసుకోండి. అంటే అక్కడ లభించే వాటితోనే  మీ భోజనాన్ని వండుకునే అవకాశాన్ని కల్పింటే బడ్జెట్ ఫ్రెండ్లీ  రెస్టారెంట్లు లేదా హోటల్స్ కోసం చూడండి. దాంతో పాటు హైకింగ్, బీచ్‌లో ఈత కొట్టడం లేదా స్థానిక పార్కులకు వెళ్లాలనుకుంటే  ఉచిత లేదా తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రాంతాలను ఎంపిక చేసుకోండి. 

అనవసర ఖర్చులను తగ్గించుకోండి:

మీ బడ్జెట్‌ను ఎక్కువ శాతం పెంచే ఖర్చులేంటో గుర్తుంచుకోండి. షాపింగ్, అనవసరమైన రవాణా ఖర్చులు వంటివి మానుకోండి. మీ బడ్జెట్‌కు కట్టుబడి ఉండండి.  వెకేషన్‌లో అత్యంత ముఖ్యమైన అంశాలకు మీ ఖర్చుకు ప్రాధాన్యత ఇవ్వండి.

స్మార్ట్ ప్యాక్:

స్మార్ట్ ప్యాకింగ్ మీ వేసవి సెలవుల్లో డబ్బు ఆదా చేయడంలో చాలా సహాయపడుతుంది. సన్‌స్క్రీన్, వాటర్ బాటిల్స్ వంటి అవసరమైన వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేయకుండా వాటిని కూడా ప్యాక్ చేసుకోండి. అలాగే మిక్స్‌డ్ అండ్ మ్యాచింగ్ అయ్యే బట్టలను ఎంచుకోండి. దీని వల్ల మీ ట్రిప్ సమయంలో ఎక్కువ బట్టలు కొనుగోలు చేయాల్సిన అవసరం రాదు.

ఈ వేసవిలో బడ్జెట్ ఫ్రెండ్లీ వెకేషన్స్ కు వెళ్లే వాళ్లు ముఖ్యంగా ప్లానింగ్, స్మార్ట్ గా ఖర్చు తగ్గించుకోవడం చేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేసి, తిరిగి రావచ్చు.