వచ్చే 5 రోజులు ఎండలు మండిపోతయ్

వచ్చే 5 రోజులు ఎండలు మండిపోతయ్

దేశంలోని చాలా ప్రాంతాల్లో జూన్‌‌‌‌ వరకు అధిక టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 5 రోజుల్లో 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ టెంపరేచర్ రికార్డయ్యే చాన్స్ ఉందని వివరించింది.

హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

న్యూఢిల్లీ: దేశంలో ఎండలు మరింత మండిపోతాయని వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. జూన్‌‌ వరకు చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 5 రోజులు2 నుంచి 4 డిగ్రీల ఎక్కువ టెంపరేచర్ రికార్డయ్యే చాన్స్ ఉందని వివరించింది. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్‌‌గఢ్‌‌లలో  రాబోయే రెండు రోజుల్లో  ఉరుములు, పిడుగులు, బలమైన గాలులతో కూడిన వర్షం పడుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ కూడా ఉంటుందని చెప్పింది. వాయువ్య రాష్ట్రాలు, ద్వీపకల్ప ప్రాంతాలు మినహా.. మిగతా ప్రాంతాల్లో జూన్ వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తెలిపింది. 

బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బెంగాల్, చత్తీస్‌‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో హీట్​వేవ్ తీవ్రంగా ఉంటుందని స్పష్టంచేసింది. ఈ నెల 19 వరకు వాయువ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో హీట్​వేవ్ కండీషన్​ కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది. హీట్​వేవ్​ నేపథ్యంలో ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు జారీచేసింది. జూన్​ వరకు పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని తెలిపింది. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ్లల్లో బయటకు రావొద్దని సూచించింది. తప్పనిసరి పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.