ఒలింపిక్స్‌లో బూతు మాటతో నోరు జారిన స్విమ్మర్

ఒలింపిక్స్‌లో బూతు మాటతో నోరు జారిన స్విమ్మర్

టోక్యో: పట్టరాని ఆనందంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఏదేదో అనేస్తుంటాం. సంతోషం, బాధ, కోపం లాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు నోరును కంట్రోల్‌లో పెట్టుకోవడం కష్టమేనని కొందరు అంటుంటారు. ఆస్ట్రేలియన్ స్విమ్మర్ కేలీ మెక్‌ కెవోన్‌ను చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఆసీస్ తరఫున స్విమ్మింగ్‌లో మెడల్ నెగ్గింది కేలీ మెక్. 

ఏకంగా గోల్డ్ మెడల్‌ను గెలుచుకొని కంగారూలను ఖుష్ చేసింది. అయితే పతకం నెగ్గిన ఆనందంలో ఆమె నోరు జారింది. మెడల్ నెగ్గిన వెంటనే ఓ చానెల్‌ రిపోర్టర్ కేలీ మెక్‌తో మాట్లాడాడు. కుటుంబ సభ్యులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని కేలీని రిపోర్టర్ అడగగా.. సమాధానమిస్తూ ఇంగ్లీష్‌లో ఎక్కువగా వాడే ఓ బూతు మాట (F**K) అనేసింది. అయితే తప్పు చేశానని అర్థం చేసుకున్న కేలీ.. ఓ షిట్ అంటూ తన ముఖాన్ని కవర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెడల్ నెగ్గినందుకు కేలీకి కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు.. ఎక్సయిట్‌మెంట్‌లో ఉన్నప్పుడు ఇలాంటి పదాలు మాట్లాడటం కామన్ అని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.