
మాడ్రిడ్: మాడ్రిడ్ ఓపెన్‌లో ఇండియా టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు షాక్ తగిలింది. మెన్స్ డబుల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన - మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బోపన్న–-ఎబ్డెన్ 6–-7 (4/7), 5–-7 తేడాతో సెబాస్టియన్ కోర్డా–-జోర్డన్ థామ్సన్ చేతిలో పోరాడి ఓడిపోయారు. మరోవైపు మెన్స్ సింగిల్స్‌లో స్పెయిన్ స్టార్ రఫెల్ నడాల్ పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. 22 ఏండ్ల చెక్ రిపబ్లిక్ ప్లేయర్ జిరి లెహెక 7–5, 6–4తో నడాల్‌కు చెక్ పెట్టాడు.