హైదరాబాద్ ఏంజిల్స్ నెట్‌‌వర్క్ ద్వారా స్టార్టప్‌‌లకు పెట్టుబడి అవకాశాలు

హైదరాబాద్ ఏంజిల్స్ నెట్‌‌వర్క్ ద్వారా స్టార్టప్‌‌లకు పెట్టుబడి అవకాశాలు

హైదరాబాద్​, వెలుగు: స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎనేబ్లర్​  టీహబ్​, దేశంలోని టెక్నాలజీ స్టార్టప్‌‌ల కోసం ఇన్నోవేషన్లను​,  వెంచర్ పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడానికి హైదరాబాద్ ఏంజిల్స్‌‌తో చేతులు కలిపింది. హైదరాబాద్ ఏంజిల్స్ తన నెట్‌‌వర్క్ ద్వారా భారతదేశం, అమెరికా, యుకె, సింగపూర్, దుబాయ్  యుఎఇ నుండి స్టార్టప్‌‌లకు పెట్టుబడి అవకాశాలను అందిస్తుందని టీహబ్​ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. ఎకో సిస్టమ్​పార్ట్​నర్లతో కలిసి పనిచేయడానికి హైదరాబాద్ ఏంజిల్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. "స్టార్టప్‌‌లకు టెక్నాలజీ, మెంటర్‌‌షిప్, ఫండింగ్ మార్గాలు,  వారి ఇన్నోవేషన్​ అజెండాలను వేగవంతం చేయడానికి అవసరమైన సాయం అందించడంలో ఈ పార్ట్​నర్​షిప్​ కీలక పాత్ర పోషిస్తుంది" అని ఆయన చెప్పారు. హైదరాబాద్ ఏంజిల్స్ చైర్మన్ రాజేష్ మంతెన మాట్లాడుతూ తమ సంస్థ ఇప్పటి వరకు 60కి పైగా స్టార్టప్‌‌లలో పెట్టుబడులు పెట్టిందని తెలిపారు.