తమిళనాడు మాజీ మంత్రి మధుసూధన్ కన్నుమూత

తమిళనాడు మాజీ మంత్రి మధుసూధన్ కన్నుమూత

చెన్నై: అన్నా డీఎంకే ప్రెసీడియం ఛైర్మన్, సీనియర్ నేత, మాజీ మంత్రి మధుసూధన్ (80) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన చికిత్స ఫలించక తుదిశ్వాస విడిచారు. ఈయన భౌతికకాయాన్ని తొండయార్ పేటలోని ఆయన నివాసానికి తరలించారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
మాజీ మంత్రి మధుసూధన్  2007 నుంచి అన్నా డీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 2017లో జయలలిత మరణానంతరం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. అన్నా డీఎంకే రెండుగా చీలిపోయినప్పుడు ప్రెసీడియం చైర్మన్ మదుసూదన్ కే ఎన్నికల సంఘం పార్టీ పేరు, గుర్తు చెందుతాయని స్పష్టం చేయగా.. ఆయన పన్నీర్ సెల్వం కు మద్దతు ప్రకటించారు. జయలలిత హయాం నుండే ఆయన ముఖ్యమైన నేతగా ఉన్నారు. ఎంజీఆర్ కాలం నుంచి పార్టీలో ఉన్న ఆయన పార్టీకి అత్యంత విశ్వాస పాత్రుడుగా గుర్తించి దివంగత ముఖ్యమంత్రి జయలలిత తొలి కేబెనెట్ లో అంటే 1991 నుంచి 86 వరకు చేనేత, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు.