యూట్యూబర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

యూట్యూబర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

తమిళనాడు యూట్యూబర్ వాసన్ డ్రైవింగ్ లైసెన్స్ పదేళ్ల పాటు మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది.  బైక్ పై స్టంట్స్ , రోడ్లపై బైక్ తో విన్యాసాలు, సాహసాలు చేస్తూ ఆ వీడియోలనుయూట్యూబ్(Youtube)లో అప్ లోడ్ చేస్తుంటాడు. సెప్టెంబర్ 17న ఓ రోడ్ ట్రిప్ లో భాగంగా అతను చెన్నై-వేలూరు(Chennai - Veluru) హైవేపై స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు.

 తమిళనాడు ఫేమస్ యూట్యూబర్(Youtuber) టీటీఎఫ్ వాసన్‌(TTF Vasan)కి మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో ఎదురుదెబ్బ తగిలింది. బైక్‌పై ప్రమాదకర రీతిలో చేసిన స్టంట్లను కోర్టు తీవ్రంగా తప్పుబడుతూ.. వాసన్ డ్రైవింగ్ లైసెన్స్‌(Driving License)ని 10 ఏళ్ల పాటు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 

దమాల్ సమీపంలోకి రాగానే అతని బైక్(Bike) అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. హెల్మెట్, రేస్ సూట్ వేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. చేతికి ఫ్రాక్చర్ అయి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  దీంతో  చక్రవాహనాన్ని నడిపినందుకు బాలుశెట్టి చత్రం పోలీసులు దాఖలు చేసిన కేసులో టిటిఎఫ్ వాసన్‌ను సెప్టెంబర్ 19న అరెస్టు చేశారు. 

పుఝల్ జైలులో ఉన్న టీటీఎఫ్ వాసన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కాంచీపురం కోర్టు ఇప్పటికే తిరస్కరించింది.  దీంతో వాసన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు.  రోడ్డుకు అడ్డుగా రావడంతో షడన్ బ్రేక్ వేయడంతో ముందు టైరు పైకి లేచిందని ...  బ్రేకులు వేయకుంటే పశువులకు ప్రమాదం జరిగేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఈ ప్రమాదంలో తనకు గాయాలయ్యాయని...   జైలులో సరైన వైద్యం అందడం లేదని, పుండ్లు తీవ్రమవుతున్నందున ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. 

ALSO READ :  21 వేల సంవత్సరాల నాటి మనిషి పాదాలు గుర్తింపు

తాను నిర్దోషినని, ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటానని పిటిషన్‌లో పేర్కొన్నాడు.విచారణ చేపట్టిన కోర్టు నిందితుడిని మందలించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి యువతను పెడదారిలో నడిచేలా చేసినందుకుగానూ 10 ఏళ్ల పాటు  అనగా 2033 అక్టోబర్ 5 వరకు అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు తీర్పునిచ్చింది. వాసన్ కు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో గణనీయంగా ఫాలోవర్లు ఉన్నారు.