21 వేల సంవత్సరాల నాటి మనిషి పాదాలు గుర్తింపు

21 వేల సంవత్సరాల నాటి మనిషి పాదాలు గుర్తింపు

శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు నమ్మినదానికి ఇంకా 7 వేల సంవత్సరాల ముందే అమెరికా ఖండంలో మనుషులు సంచరించారని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో బైటపడింది. ఆసియా నుండి ఖండం నుంచి మనుషులు ఇక్కడికి ఎప్పుడు వచ్చి స్థిరపడ్డారనే అంశం అనేక దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉంది.

16 వేల సంవత్సరాల కంటే ముందే ఉత్తర అమెరికా భూభాగంలో మనుషులు అడుగు పెట్టి ఉంటారన్న వాదనపై చాలామంది పరిశోధకులు సందేహాలు వ్యక్తం చేశారు.అయితే, తాజాగా న్యూ మెక్సికోలో పనిచేస్తున్న బృందం 23 వేల సంవత్సరాలు ... లేదా.. 21వేల సంవత్సరాల నాటివిగా భావిస్తున్న మనిషి పాదముద్రలను కనుగొంది. కొత్తగా లభించిన ఆధారాలు అమెరికా ఖండంలో మనుషులు కదలికలు ఎప్పటి నుంచి ఉన్నాయన్నదానిపై ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయాలను మార్చే అవకాశం ఉంది. ఇక్కడికి అంతకు ముందే పెద్ద ఎత్తున వలసలు జరిగి ఉండొచ్చని, ఆ జనాభా అంతరించి పోయి ఉండవచ్చని కూడా భావించేందుకు ఆస్కారం ఏర్పడింది. ఈ పాదముద్రలు ఓ సరస్సుకు చెందిన మెత్తటి మట్టిలో కనిపించాయి. ఈ పరిశోధన వివరాలు సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.

అమెరికాలో మానవ ఉనికి చరిత్రను తిరిగి వ్రాయగల అవకాశం ఉన్నందున పురావస్తు శాస్త్రవేత్తలలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. . ఈ ప్రాంతంలోని  పురావస్తు ప్రదేశాల్లో  మానవ ఉనికిని సూచించే ఆదిమానవుల పాదముద్రలను గుర్తించారు. మానవులు గతంలో నమ్మిన దానికంటే చాలా ముందుగానే ఈ ప్రాంతంలో నివసించారని  ఈ ఆధారాల ద్వారా తెలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా జియాలాజికల్ సర్వే బృందం  కనుగొన్న ఈ పాదముద్రలప్రాంతంలోని మట్టి పొరల్లోని విత్తనాలపై రేడియో కార్బన్ డేటింగ్ టెస్టులు నిర్వహించింది. పాదముద్రల సైజులను బట్టి చూస్తే ఈ పాద ముద్రలు చిన్న పిల్లలు, టీనేజర్లు అటు ఇటు తిరుగుతున్నప్పుడు పడినవిగా గుర్తించారు. అక్కడక్కడా పెద్ద వాళ్ల పాదాల గుర్తులు కూడా కనిపించాయి.

అమెరికాలో తొలి మానవులు ఉపయోగించిన ఈటెల్లాంటి వస్తువులు కొన్ని 13వేల  సంవత్సరాల కిందట ఉత్తర అమెరికాలో తిరిగిన మనుషులు ఉపయోగించిన ఈటెలకన్నా తక్కువ మొనదేలి ఉన్నాయి. ఈ తేడాల కారణంగా ఇక్కడి ప్రాచీన మానవులు ఎవరు అన్న సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయని బోర్న్‌మౌత్ యూనివర్సిటికి చెందిన ప్రొఫెసర్ మాథ్యూ బెన్నెట్  అన్నారు.'వీటిని బట్టి చూస్తే ఇవి 21 నుంచి -23 వేల సంవత్సరాల పురాతనమైనవని తాను  అనుకుంటున్నానని ప్రొఫెసర్ హిగమ్  అన్నారు. 

ఈ ప్రాంతంలో చారిత్రక పరిణామాలపై అమెరికా పురావస్తు శాస్త్రవేత్తలలో భిన్నమైన అభిప్రాయాలున్నాయి. అయితే 20వ శతాబ్దంలో  వీరి మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. క్లోవిస్ సంస్కృతికి చెందిన వ్యక్తులు అమెరికాకు మొదట వచ్చారని వారు అంగీకరించారు. ఇలా శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో క్లోవిస్ సంస్కృతికి చెందిన మానవులకన్నా ప్రాచీనమైన మానవులు ఉన్నారు అన్న అనుమానాలను కూడా అంతా మరిచిపోయారు.

న్యూ మెక్సికోలో లభించిన పాదముద్రల సాక్ష్యాలు గత మంచు యుగం నాటికి ఉత్తర అమెరికా భూభాగంలోకి మనుషులు చేరుకున్నారని సూచిస్తున్నాయి. భారీ మంచు పలకలు  కెనడాలో ఎక్కువ భాగం ఆక్రమించి ఉన్నాయి. ఇవి ఆసియా నుంచి వచ్చిన వారికి అడ్డంకిగా మారి ఉండవచ్చు. అయితే, అంతకు ముందు ఈ దారులు దాటడానికి సులభంగా ఉన్నప్పుడు మానవులు ఇక్కడి వచ్చి ఉండవచ్చునన్న అభిప్రాయం వినిపిస్తోంది