SL vs AFG  Cricket: మిడిల్ ఈస్ట్లో యుద్ధం..  శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ మధ్య సిరీస్ రద్దు

SL vs AFG  Cricket: మిడిల్ ఈస్ట్లో యుద్ధం..  శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ మధ్య సిరీస్ రద్దు

SL vs AFG  Cricket: మిడిల్ ఈస్ట్ లో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతల సెగ క్రికెట్ కి కూడా తగిలింది. షెడ్యూల్ ప్రకారం మార్చి 13 నుంచి 25వ తేదీ వరకు శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా వైట్ బాల్ సిరీస్ ఆరంభం కావాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రస్తుతం ఆ సిరీస్ పూర్తిగా రద్దు అయింది. ఆ ప్రాంతంలో యుద్ధ పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలు సరిగ్గా లేకపోవడంతో.. సిరీస్ ను క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని శ్రీలంక క్రికెట్ బోర్డుకు సంబంధించిన అధికారి ఒకరు వెల్లడించారు. 

అయితే దుబాయ్ లోని షార్జా వేదికగా మార్చి 13వ తేదీ నుంచి అఫ్ఘానిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ లు, మార్చి 20, 22, 25 తేదీల్లో మూడు వన్డే మ్యాచులు జరగాల్సి ఉండగా.. భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఇప్పుడు అక్కడు ఈ సిరీస్ నిర్వహించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఇటీవల భారత్– శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ ముగిసింది.. ఈ టోర్నీ ముగిసిన తర్వాత సైతం పలు జట్లు.. విమాన రాకపోకల్లో అంతరాయం ఏర్పడం వల్ల స్వదేశాలకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు.  

పశ్చిమాసియా యుద్ధం గంటగంటకూ మారుతున్న పరిణామాలు ఇప్పుడు ప్రపంచాన్ని తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తుంది. ఒకవైపు అమెరికా– -ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ విలవిలలాడుతుంటే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం 'తొందరగా ముగిసిపోతుందని ప్రకటించాడు. ఇప్పటికే ఇరాన్ నౌకాదళం, వాయుసేన పూర్తిగా ధ్వంసం అయ్యాయని, వారి సైనిక శక్తి ఇప్పుడు జోరో అని ట్రంప్ వెల్లడించారు. అయితే ఇదే సమయంలో టెహ్రాన్ మాత్రం ఇప్పుడే యుద్ధం మొదలైందంటూ పోస్ట్ చేయడం అందరినీ షాక్ గురి చేస్తోంది.