ప్రభు, హరిప్రియ జంటగా వంశీ మునగాల దర్శకత్వంలో ఉపేందర్ గంగావెల్లి నిర్మిస్తున్న చిత్రం ‘తీరం’. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు ‘పుష్ప’ ఫేమ్ జగదీష్, ఫన్ బకెట్ మహేష్ విట్టా, రాజ్‌కుమార్ కసిరెడ్డి, దర్శకుడు ప్రసాద్, జబర్దస్త్ సద్దాం, నటుడు కుమానన్ హాజరై టైటిల్ సాంగ్‌ను లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.
దర్శకుడు వంశీ మునగాల మాట్లాడుతూ ‘ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉంటుంది. చిత్రీకరణ విజయవంతంగా పూర్తై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. ఈ చిత్రంలో నటించడం పట్ల నటీనటులు ఆనందం వ్యక్తం చేశారు.
నిర్మాత ఉపేందర్ మాట్లాడుతూ ‘అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
