ఓ దిక్కు వాన.. మరో దిక్కు చలి. ఇలాంటి చల్లని వాతావరణంలో రొటీన్ శ్నాక్స్ కాకుండా వెరైటీ వంటలు తినాలనిపిస్తుంది. ఇక శ్నాక్స్ విషయానికొస్తే పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ఎవరూ కాంప్రమైజ్ కాలేరు. మరి కొత్తగా, రుచికరమైన శ్నాక్స్ కావాలంటే.. రైనీ సీజన్లో లో విరివిగా దొరికే ఉల్లిపొర లేదా ఉల్లికాడ (స్ప్రింగ్ ఆనియన్)లతో నోరూరించే వంటలు మీకోసం. .
స్ప్రింగ్ పరాటా తయారీకి కావాల్సినవి
- ఉల్లిపొర తరుగు- రెండుకప్పులు
- వెనిగర్ -పావు టీ స్పూన్
- వెల్లుల్లి తరుగు - ఒక టీ స్పూన్
- ఉప్పు- తగినంత
- మిరియాల పొడి- రెండు టీ స్పూన్లు
- కార్న్ ఫోర్- ఒక కప్పు
- గోధుమపిండి- అర కప్పు
- సోయా సాస్- రెండు టేబుల్ స్పూన్లు
- టొమాటో కెచప్ -- రెండు టేబుల్ స్పూన్లు
- నూనె - సరిపడా
స్ప్రింగ్ పరాటా తయారీ విధానం
ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉల్లిపొర తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండిలా ముద్ద చేసుకోవాలి. దాన్ని చిన్నచిన్న ఉండలుగా తీసుకుని పరాటాల్లా వత్తాలి. వీటిని నూనె లేదా నెయ్యితో పెనంతో రెండువైపులా కాల్చుకోవాలి. వీటిని ఏ చట్నీతో తిన్నారుచిగా ఉంటాయి
ఉల్లికాడల పొంగనాలు తయారీకి కావాల్సినవి
- ఉల్లిపొర తరుగు- ఒక కప్పు
- గోధుమ పిండి- ఒక కప్పు
- అల్లం-వెల్లుల్లి పేస్ట్-ఒక టేబుల్ స్పూన్
- కొత్తిమీర తరుగు- పావు కప్పు
- పచ్చిమిర్చి తరుగు - ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు- తగినంత
- జీలకర్ర- రెండు టీ స్పూన్లు
ఉల్లికాడల పొంగనాలు తయారీ విధానం
ఒక పెద్ద గిన్నెలో బియ్యప్పిండి, శెనగపిండి, ఉల్లిపొర తరుగు వేసి కలపాలి. అందులో కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు, కారం,సోడా కూడా వేయాలి. రుచికి తగ్గట్లు కారం ఎక్కువ, తక్కువ వేసుకోవచ్చు. ఎండుకారం వద్దనుకునేవాళ్లు రెండు పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన పొంగనాల గిన్నెలో వేసి ఉడికించాలి. అలాకాకుండా ఈ పిండిని పకోడీల్లా కూడా వేసుకోవచ్చు..
బటర్ మిల్క్ స్ప్రింగ్స్ తయారీకి కావాలసినవి
- ఉల్లిపొర - ఒక కట్ట
- మజ్జిగ -రెండు కప్పులు
- రెడ్ చిల్లీ సాస్ ఒకటి స్పూన్
- ఎగ్ మయొనైస్- రెండు టేబుల్ స్పూన్లు
- ఉప్పు- తగినంత
- మిరియాల పొడి-చిటికెడు
- నూనె - ఒక కప్పు
- మైదా పిండి- ఒక కప్పు
బటర్ మిల్క్ స్ప్రింగ్స్ తయారీ విధానం
ఉల్లిపొరలను శుభ్రం చేసి లాలిపప్స్ లా కట్ చేసుకుని పక్కనపెట్టాలి. మజ్జిగ పోసిన గిన్నెలో ఈ ఉల్లిపొరలను. వేసి మూతపెట్టాలి. దాన్ని రాత్రంతా ఫ్రీజ్ లో ఉంచాలి. తెల్లారి మరో గిన్నెలో ఎగ్ మయొనైస్, రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కూడా అరగంటసేపు ఫ్రిజ్ లో పెట్టాలి. తర్వాత ఒక గిన్నెలో మైదాపిండి, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. మజ్జిగలోంచి ఉల్లిపొరలను బయటకు తీసి ఆరబెట్టాలి. తర్వాత వాటిని మైదాపిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. అంతే, కరకరలాడే బటర్ మిల్క్ స్ప్రింగ్స్ రెడీ
ఉల్లికాడ సిగార్స్ తయారీకి కావలసినవి
- ఉల్లిపొర తరుగు- రెండుకప్పులు
- వెనిగర్ -పావు టీ స్పూన్
- వెల్లుల్లి తరుగు - ఒక టీ స్పూన్
- ఉప్పు- తగినంత
- మిరియాల పొడి- రెండు టీ స్పూన్లు
- కార్న్ ఫోర్- ఒక కప్పు
- గోధుమపిండి- అర కప్పు
- సోయా సాస్- రెండు టేబుల్ స్పూన్లు
- టొమాటో కెచప్ -- రెండు టేబుల్ స్పూన్లు
- నూనె - సరిపడా
ఉల్లికాడ సిగార్స్ తయారీ విధానం
ముందుగా సిగార్స్ కోసం ఒక గిన్నెలో గోధుమ పిండి, అర కప్పు కార్న్ ఫ్లోర్, కొన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. దాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి, పల్చగా వత్తుకోవాలి. ఆపైన పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి.. అందులో ఉల్లిపొర తరుగు, వెల్లుల్లి తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగించాలి. అందులోనే వెనిగర్, కార్న్ ఫ్లోర్, సోయా సాస్, టొమాటో కెచప్ వేసి స్టఫ్ తయారు చేసుకోవాలి. పల్చటి చపాతీలా చేసుకున్న వాటిపై ఈ స్టఫ్ పెట్టి, చివర్లను లోపలకు మడిచి రోల్ చేసుకోవాలి. అలా చేసుకున్న సిగార్లను నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. . .!
