సుమంత్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్‌లో సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. కలిపు మధు, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న సినిమా విడుదల కాబోతోంది. ఆ వివరాలు తెలియజేసేందుకు సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో సుమంత్ మాట్లాడుతూ ‘టీజర్‌ను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఊహించని సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులు, సర్‌ప్రైజ్ ట్విస్టులు ఎన్నో సినిమాలో ఉన్నాయి.
సినిమా చూసిన ప్రతి ఒక్కరు సంతృప్తి చెందుతారు’ అని అన్నాడు. ప్రతి ఒక్కరూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, టీజర్‌లో చూసిన దానికి మించి మరింత అద్భుతంగా సినిమా ఉండబోతోందని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చెప్పాడు. వారాహి అమ్మవారి భక్తురాలినైన తాను ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నట్టు సీనియర్ నటి మంజు భార్గవి చెప్పారు.
వారాహి అమ్మవారికి సంబంధించి ఎప్పటికీ గుర్తుండిపోయేలా రెండు అద్భుతమైన పాటలు రాబోతున్నాయి అని నిర్మాత మధు తెలియజేశారు. నటీనటులు శ్రీనివాస్ వడ్లమాని, వంశీ చాగంటి, మీనాక్షి గోస్వామి, ఫైట్ మాస్టర్ అంజి తదితరులు పాల్గొన్నారు.
