వారియర్ క్వీన్‌‌‌‌ గా.. భూమి పెడ్నేకర్..

వారియర్ క్వీన్‌‌‌‌ గా.. భూమి పెడ్నేకర్..

విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా బాలీవుడ్‌‌‌‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న భూమి పెడ్నేకర్..  ఇప్పుడు కర్ణాటకకు చెందిన వారియర్‌‌‌‌‌‌‌‌ క్వీన్‌‌‌‌గా కనిపించబోతోంది.  ‘కాంతార’ ఫేమ్ రిష‌‌‌‌బ్ శెట్టి హీరోగా ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది.  ‘ది ప్రైడ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ భారత్: ఛత్రపతి శివాజీ మహరాజ్‌‌‌‌’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సందీప్ సింగ్‌‌‌‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఐదు వందల కోట్ల బడ్జెట్‌‌‌‌తో రెండు భాగాలుగా ఈ పాన్ ఇండియా మూవీ రానుంది.  

అర్జున్ రాంపాల్, వివేక్ ఒబెరాయ్‌‌‌‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో భూమి పెడ్నేకర్‌‌‌‌‌‌‌‌ కూడా నటించబోతోందంటూ సోమవారం కీలక అప్‌‌‌‌డేట్‌‌‌‌ను ఇచ్చారు మేకర్స్‌‌‌‌. దేశ చరిత్రలో మహిళా సైన్యాన్ని ఏర్పాటుచేసిన తొలిరాణిగా ప్రసిద్ధి చెందిన బెలవాడి మల్లమ్మ పాత్రను భూమి పెడ్నేకర్‌‌‌‌‌‌‌‌ పోషించబోతోంది. 

శివాజీ, మల్లమ్మ మధ్య ఇరవై ఏడు రోజుల పాటు యుద్ధం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఆ సంఘర్షణను ఇందులో చూపించబోతున్నారట. ఇలాంటి ఓ గొప్ప చిత్రంలో భాగమవడం గౌరవంగా భావిస్తున్నానని భూమి పెడ్నేకర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది.  ఇక మల్లమ్మ పాత్ర కోసం హార్స్‌‌‌‌ రైడింగ్‌‌‌‌ సహా యుద్ధ విద్యల్లో ఆమె శిక్షణ తీసుకోబోతోంది. వచ్చే ఏడాది చిత్రం సెట్స్‌‌‌‌కు వెళ్లనుంది.