హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల రైతులకు సాగునీరు విడుదల

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల రైతులకు సాగునీరు విడుదల

భీమదేవరపల్లి/ ఎల్కతుర్తి, వెలుగు: వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడేందుకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల రైతులకు దేవాదుల కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. 

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ ప్రధాన ఇంజనీర్ సుధీర్, పర్యవేక్షక ఇంజనీర్ రాంప్రసాద్ ఆధ్వర్యంలో నీటి విడుదల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్, పోచంపల్లి రాజారెడ్డి, సర్పంచులు, రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.