కొరియన్ కల్చర్ అంటే చాలా ఇష్టమంటున్న రితికా నాయక్

కొరియన్ కల్చర్ అంటే చాలా ఇష్టమంటున్న రితికా నాయక్

గతేడాది ‘మిరాయ్’ చిత్రంతో మెప్పించిన  రితికా నాయక్ ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్‌‌‌‌ తేజ్‌‌‌‌కు జంటగా నటించిన ఈ సినిమాకు  మేర్లపాక  గాంధీ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ సంస్థలు నిర్మించాయి. ఆగస్టు 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్  రితికా నాయక్  ఇలా ముచ్చటించింది. 

‘‘ఈ కథ విన్నప్పుడు  కొరియా వెళ్ళడం నన్ను మొదట ఆకట్టుకుంది. (నవ్వుతూ) ఎందుకంటే నాకు కొరియన్ కల్చర్, అక్కడి సినిమాలు, కొరియన్ డ్రామాలు అంటే చాలా ఇష్టం. ఇందులో నేను చేసిన పాత్రకు, నా వ్యక్తిత్వానికి కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. ఇది కేవలం కమర్షియల్ పాత్ర మాత్రమే కాదు. చాలా డిఫరెంట్‌‌‌‌గా ఉంటుంది. ప్రేక్షకులు నా పాత్రకు బాగా కనెక్ట్ అవుతారని నమ్ముతున్నా.  ఇందులో   నేను సెల్ఫ్ ఇండిపెండెంట్,  మోడర్న్ గర్ల్‌‌‌‌గా కనిపిస్తా.  సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. హారర్ కామెడీలు చాలా వచ్చినప్పటికీ, ఇందులోని కథ, ఇండియన్, కొరియన్ కల్చర్స్ అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. 

వరుణ్‌‌‌‌ తేజ్‌‌‌‌తో  వర్కింగ్ ఎక్స్‌‌‌‌పీరియెన్స్ చాలా నచ్చింది. ఆయన హార్డ్ వర్కింగ్ పర్సన్.   ఇటీవల కొన్ని ప్యాచ్‌‌‌‌వర్క్  షూట్స్ చేశాం. ఆయనకు గాయం ఉన్నప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు షూట్‌‌‌‌లో పాల్గొన్నారు. ఇందులో సత్య పాత్ర   ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.  అలాగే  వీటీవీ గణేష్, బుల్లిరాజు పాత్రలు కడుపుబ్బా నవ్విస్తాయి.  యూవీ క్రియేషన్స్‌‌‌‌తో పనిచేయడం చాలా మంచి ఎక్స్‌‌‌‌పీరియన్స్. 

షూటింగ్ సమయంలో ఒకసారి నాకు  హెల్త్ బాగోలేకపోతే ఎంతో కేర్ తీసుకున్నారు.  ఇక  ప్రస్తుతం ఒక తెలుగు  ప్రాజెక్ట్ చేస్తున్నా. అలాగే ‘మిరాయ్ 2’ ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది.  వెంటవెంటనే సినిమాలు చేయాలని లేదు.  మంచి స్క్రిప్ట్ కోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తాను.   ప్రేక్షకులు మెచ్చే పాత్రలు చేయడంపైనే నా దృష్టి ఉంటుంది’’.