మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో కారు బీభత్సం సృష్టించింది. చెట్టును ఢీకొట్టిన కారు ఇద్దరు జిహెచ్ఎంసి కార్మికులపై పడింది. దీంతో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
కెఎన్ఆర్ నగర్ కాలనీ దగ్గర మార్చి 10న తెల్లవారుజామున రోడ్డు ఊడుస్తుండగా అతి వేగంతో వచ్చిన కారు చెట్టును ఢీకొని పక్కనే ఉన్న పారిశుద్ధ కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో జవహర్ నగర్ కు చెందిన రవి, ప్రమోద్ అనే ఇద్దరు కార్మికులకు గాయాలవ్వగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఈసీఐఎల్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
కారు కార్మికులను ఢీకొట్టిన దృశ్యాలు సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
