టైమొచ్చినప్పుడు చెబుతా.. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

టైమొచ్చినప్పుడు చెబుతా.. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

జగిత్యాల: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని.. ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‎లో మంగళవారం (మార్చి 10) జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.

 పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు ఈ సందర్భంగా ఆయన సమాధానమిచ్చారు. ఏ అంశమైనా మీకు తెలియకుండా జరగదన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రోజే పరిస్థితి గురించి చెప్పానని.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా.. వద్దా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. 

అయితే.. పార్టీ మార్పుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని.. ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని తెలిపారు. కాగా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విషయంలో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.