గ్రాండ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ దిశగా టీమిండియా

గ్రాండ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ దిశగా టీమిండియా
  • ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 325 ఆలౌట్‌‌‌‌‌‌‌‌
  • 62 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌

 టీమిండియా భారీ విజయం దిశగా సాగుతోంది..! ముంబై బార్న్‌‌‌‌‌‌‌‌ న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అజాజ్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ 10/10 వికెట్లతో హిస్టరీ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసినా.. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో కివీస్‌‌‌‌‌‌‌‌ అట్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాఫ్‌‌‌‌‌‌‌‌ అయ్యింది..! హైదరాబాదీ మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌ (3/19), స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌ (4/8) దాడిని తట్టుకోలేక.. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 62 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది..! దీంతో భారీ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌తో మళ్లీ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన టీమిండియా.. భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను నిర్దేశించే పనిలో ఉంది..! ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా మన బౌలర్లు మరోసారి సత్తా చాటితే.. నేడే టీమిండియా విజయం ఖాయంగా కనిపిస్తోంది..!!

ముంబై: మన బ్యాటర్లు సత్తా చాటిన చోట.. న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ ఫెయిల్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. కివీస్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అజాజ్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ చెలరేగిన చోట.. మన బౌలర్లూ విజృంభించారు. ఫలితంగా ఒకే ఒక్క సెషన్‌‌‌‌‌‌‌‌ ఆటతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకొచ్చారు. దీంతో సెకండ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌లో కోహ్లీసేన విజయం లాంఛనంగా మారింది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో మయాంక్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ (311 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 150), అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (52) రాణించడంతో.. శనివారం రెండో రోజు ఇండియా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 109.5 ఓవర్లలో 325 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 28.1 ఓవర్లలో 62 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. దీంతో కోహ్లీసేనకు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 263 రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ దక్కింది. జెమీసన్‌‌‌‌‌‌‌‌ (17) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. లాస్ట్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా సెకండ్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 21 ఓవర్లలో 69/0 స్కోరు చేసింది. ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు మయాంక్‌‌‌‌‌‌‌‌ (38 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), పుజారా (29 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 332 రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నది. 
అజాజ్‌‌‌‌‌‌‌‌.. అద్భుతః
తొలి రోజు 4 కీలక వికెట్లు తీసిన అజాజ్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌.. సెకండ్‌‌‌‌‌‌‌‌ డే మరింత రెచ్చిపోయాడు. పిచ్‌‌‌‌‌‌‌‌పై మంచి టర్నింగ్‌‌‌‌‌‌‌‌ లభించడంతో పాటు పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ బౌన్స్‌‌‌‌‌‌‌‌ను రాబడుతూ.. ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లోని 10 వికెట్లను తన ఖాతాలోనే వెసుకుని సరికొత్త రికార్డును క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 221/4 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియాను స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లోనే అజాజ్‌‌‌‌‌‌‌‌ దెబ్బకొట్టిండు. ఓ ఎండ్‌‌‌‌‌‌‌‌లో మయాంక్‌‌‌‌‌‌‌‌ నిలకడగా ఆడినా.. డే సెకండ్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌లో అజాజ్‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌ ఝలక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిండు. వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో వృద్ధిమాన్ సాహా (27), అశ్విన్‌‌‌‌‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఇండియా స్కోరు 224/6గా మారింది. అజాజ్‌‌‌‌‌‌‌‌ వేసిన పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ ఆర్మ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను బ్యాక్‌‌‌‌‌‌‌‌ఫుట్‌‌‌‌‌‌‌‌ ఆడబోయి సాహా ఎల్బీ అయ్యాడు. నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ వేసిన ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ డెలివరీకి  అశ్విన్‌‌‌‌‌‌‌‌ క్లీన్‌‌‌‌‌‌‌‌ బౌల్డ్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. కానీ బౌలర్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌కు అప్పీల్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడనే ఉద్దేశంతో అశ్విన్‌‌‌‌‌‌‌‌ తొందరపడి డీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి వృథా చేశాడు. ఇక ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌.. మయాంక్‌‌‌‌‌‌‌‌కు అండగా నిలిచాడు. దాదాపు రెండు గంటల పాటు కివీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను కాపాడాడు. అయితే న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌లో అజాజ్‌‌‌‌‌‌‌‌ పర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ టర్నింగ్‌‌‌‌‌‌‌‌, సూపర్‌‌‌‌‌‌‌‌ బౌన్స్‌‌‌‌‌‌‌‌తో చెలరేగినా.. మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో నెమ్మదిగా ఆడిన ఇండియా జోడీ ఈ సెషన్‌‌‌‌‌‌‌‌లో 28 ఓవర్లు ఆడి 64 రన్స్ జత చేసింది. లంచ్‌‌‌‌‌‌‌‌ వరకు ఇండియా 285/6 స్కోరు చేసింది. సెకండ్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌లో ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ కేవలం 11.5 ఓవర్లు మాత్రమే సాగింది. అక్షర్‌‌‌‌‌‌‌‌, మయాంక్‌‌‌‌‌‌‌‌ ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 67 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి ఔటయ్యారు. లాస్ట్‌‌‌‌‌‌‌‌లో జయంత్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ (24) కాసేపు ఆడినా, సిరాజ్‌‌‌‌‌‌‌‌ (4), ఉమేశ్‌‌‌‌‌‌‌‌ (0 నాటౌట్‌‌‌‌‌‌‌‌) పెద్దగా రాణించలేదు. ఈ నాలుగు వికెట్లు కూడా అజాజ్‌‌‌‌‌‌‌‌ ఖాతాలోకే వెళ్లడం విశేషం. 
సిరాజ్‌‌‌‌‌‌‌‌.. సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెల్‌‌‌‌‌‌‌‌
సెకండ్‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాదీ పేసర్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌ నాలుగు ఓవర్ల సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెల్‌‌‌‌‌‌‌‌తో వణికించేశాడు. నాలుగో ఓవర్‌‌‌‌‌‌‌‌లో వేసిన రెండు సూపర్ ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ స్ట్రెయిట్‌‌‌‌‌‌‌‌ డెలివరీస్‌‌‌‌‌‌‌‌కు యంగ్‌‌‌‌‌‌‌‌ (4), లాథమ్‌‌‌‌‌‌‌‌ (10) వికెట్లు ఇచ్చుకున్నారు. 6వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో యాంగిల్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌ డెలివరీకి రాస్‌‌‌‌‌‌‌‌ టేలర్‌‌‌‌‌‌‌‌ (1) క్లీన్‌‌‌‌‌‌‌‌ బౌల్డ్‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. కివీస్‌‌‌‌‌‌‌‌ స్కోరు 17/3గా మారింది. ఇక్కడి నుంచి అశ్విన్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (2/14) ప్రెజర్‌‌‌‌‌‌‌‌ను కివీస్‌‌‌‌‌‌‌‌ అధిగమించలేకపోయింది. సిరాజ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ఉమేశ్‌‌‌‌‌‌‌‌ వికెట్లు తీయకపోయినా.. రన్స్‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేశాడు. మధ్యలో జయంత్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ (1/13) కూడా ఓ చేయి వేయడంతో 28 ఓవర్లలోనే బ్లాక్‌‌‌‌‌‌‌‌ క్యాప్స్‌‌‌‌‌‌‌‌ ఆట ముగిసింది. మధ్యలో జెమీసన్‌‌‌‌‌‌‌‌ కాసేపు ఆడినా.. మిగతా వారు పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 9 మంది బ్యాటర్లు సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితం కావడంతో కివీస్‌‌‌‌‌‌‌‌ తక్కువ స్కోరుకే చాప చుట్టేసింది. ఫలితంగా ఇండియన్‌‌‌‌‌‌‌‌ గడ్డపై అతి తక్కువ స్కోరు చేసిన జట్టుగా కివీస్‌‌‌‌‌‌‌‌ రికార్డులకెక్కింది. 

స్కోరు బోర్డు
ఇండియా ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: మయాంక్‌‌‌‌‌‌‌‌ (సి) బ్లండెల్‌‌‌‌‌‌‌‌ (బి) పటేల్‌‌‌‌‌‌‌‌ 150, గిల్‌‌‌‌‌‌‌‌ (సి) టేలర్‌‌‌‌‌‌‌‌ (బి) పటేల్‌‌‌‌‌‌‌‌ 44, పుజారా (బి) పటేల్‌‌‌‌‌‌‌‌ 0, కోహ్లీ (ఎల్బీ) పటేల్‌‌‌‌‌‌‌‌ 0, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ (సి) బ్లండెల్‌‌‌‌‌‌‌‌ (బి) పటేల్‌‌‌‌‌‌‌‌ 18, సాహా (ఎల్బీ) పటేల్‌‌‌‌‌‌‌‌ 27, అశ్విన్‌‌‌‌‌‌‌‌ (బి) పటేల్‌‌‌‌‌‌‌‌ 0, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (ఎల్బీ) పటేల్‌‌‌‌‌‌‌‌ 52, జయంత్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ (సి) రవీంద్ర (బి) పటేల్‌‌‌‌‌‌‌‌ 12, ఉమేశ్‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌‌‌‌‌‌‌‌) 0, సిరాజ్‌‌‌‌‌‌‌‌ (సి) రవీంద్ర (బి) పటేల్‌‌‌‌‌‌‌‌ 4, ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాలు: 18, మొత్తం: 109.5 ఓవర్లలో 325 ఆలౌట్‌‌‌‌‌‌‌‌. వికెట్లపతనం: 1–80, 2–80, 3–80, 4–160, 5–224, 6–224, 7–291, 8–316, 9–321, 10–325. బౌలింగ్‌‌‌‌‌‌‌‌: సౌథీ 22–6–43–0, జెమీసన్‌‌‌‌‌‌‌‌ 12–3–36–0, అజాజ్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ 47.5–12–119–10, సోమర్‌‌‌‌‌‌‌‌విల్లే 19–0–80–0, రచిన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర 4–0–20–0, డారిల్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌ 5–3–9–0. 
న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: లాథమ్‌‌‌‌‌‌‌‌ (సి) శ్రేయస్‌‌‌‌‌‌‌‌ (బి) సిరాజ్‌‌‌‌‌‌‌‌ 10, విల్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌ (సి) కోహ్లీ (బి) సిరాజ్‌‌‌‌‌‌‌‌ 4, మిచెల్‌‌‌‌‌‌‌‌ (ఎల్బీ) పటేల్‌‌‌‌‌‌‌‌ 8, టేలర్‌‌‌‌‌‌‌‌ (బి) సిరాజ్‌‌‌‌‌‌‌‌ 1, నికోల్స్‌‌‌‌‌‌‌‌ (బి) అశ్విన్‌‌‌‌‌‌‌‌ 7, బ్లండెల్‌‌‌‌‌‌‌‌ (సి) పుజారా (బి) అశ్విన్‌‌‌‌‌‌‌‌ 8, రవీంద్ర (సి) కోహ్లీ (బి) జయంత్‌‌‌‌‌‌‌‌ 4, జెమీసన్‌‌‌‌‌‌‌‌ (సి) శ్రేయస్‌‌‌‌‌‌‌‌ (బి) పటేల్‌‌‌‌‌‌‌‌ 17, సౌథీ (సి) (సబ్‌‌‌‌‌‌‌‌) సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ (బి) అశ్విన్‌‌‌‌‌‌‌‌ 0, సోమర్‌‌‌‌‌‌‌‌విల్లే (సి) సిరాజ్‌‌‌‌‌‌‌‌ (బి) అశ్విని 0, అజాజ్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌‌‌‌‌‌‌‌) 0, ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాలు: 3, మొత్తం: 28.1 ఓవర్లలో 62 ఆలౌట్‌‌‌‌‌‌‌‌. వికెట్లపతనం: 1–10, 2–15, 3–17, 4–27, 5–31, 6–38, 7–53, 8–53, 9–62, 10–62. బౌలింగ్‌‌‌‌‌‌‌‌: ఉమేశ్‌‌‌‌‌‌‌‌ 5–2–7–0, సిరాజ్‌‌‌‌‌‌‌‌ 4–0–19–3, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ 9.1–3–14–2, అశ్విన్‌‌‌‌‌‌‌‌ 8–2–8–4, జయంత్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ 2–0–13–1. 
ఇండియా సెకండ్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: మయాంక్‌‌‌‌‌‌‌‌ (బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) 38, పుజారా (బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) 29, ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాలు: 2, మొత్తం: 21 ఓవర్లలో 69/0. బౌలింగ్‌‌‌‌‌‌‌‌: సౌథీ 5–0–14–0, అజాజ్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ 9–1–35–0, జెమీసన్‌‌‌‌‌‌‌‌ 4–2–5–0, సోమర్‌‌‌‌‌‌‌‌విల్లే 2–0–9–0, రచిన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర 1–0–4–0.