నా బిడ్డ క్షేమంగా రావడం సంతోషంగా ఉంది

నా బిడ్డ క్షేమంగా రావడం సంతోషంగా ఉంది

రష్యా చెలరేగిపోతోంది.యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది.ఎటువైపు చూసినా  కనుచూపుమేర బీతవాహన దృశ్యాలే కనిపిస్తున్నాయి.రష్యా దాడులతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న  భారతీయ విద్యార్థులు క్షణ మొక యుగంలా గడిపారు. ఎప్పుడు స్వదేశానికి వెళ్తామా అని ఎదరుచూశారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగా కార్యక్రమం చేపట్టడంతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న స్టూడెంట్స్ ను భారత్ కు తీసుకువచ్చారు. ఈక్రమంలో ఉక్రెయిన్  నుంచి ఎప్పుడు తమ కన్నబిడ్డలు వస్తారా అని తల్లిదండ్రులు వెయ్యికళ్లతో ఎదురుచూశారు.యుద్ధంలో అతాలకుతలమైన ఉక్రెయిన్ నుంచి వచ్చిన కూతురు సలోనిని చూసి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో గుండెలవిసేలా బోరున విలపించింది తల్లి. కూతురుని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం కూతురికి స్వీట్లు తినిపించి ఆనందాన్ని వ్యక్తం చేసింది. తన బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగి రావడం ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను అన్నారు. కూతురిని క్షేమంగా తీసుకువచ్చిన కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారామె.

మరిన్ని వార్తల కోసం

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం: జెలెన్స్కీకి మోడీ ఫోన్ కాల్ 

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్