రష్యా, ఉక్రెయిన్ యుద్ధం: జెలెన్స్కీకి మోడీ ఫోన్ కాల్ 

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం: జెలెన్స్కీకి మోడీ ఫోన్ కాల్ 

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల నేపథ్యంలో ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ఇరు నేతలు చర్చించారు. అలాగే అక్కడ చిక్కుకున్న భారతీయులు, వారి తరలింపు గురించి మాట్లాడారు. ఉద్రిక్తతల తగ్గింపునకు సంబంధించి రష్యాతో ఉక్రెయిన్ కొనసాగిస్తున్న చర్చలపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జెలెన్స్కీని ఆయన అభినందించారు. ఉక్రెయిన్ లోని భారతీయులను స్వదేశానికి పంపడంలో జెలెన్స్కీ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మోడీ ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 35 నిమిషాల పాటు జెలెన్స్కీ, మోడీ మధ్య చర్చలు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల తెలిపాయి.  

మరిన్ని వార్తల కోసం:

యుద్ధానికి మరోసారి బ్రేక్

గవర్నర్కే మాట్లాడే దిక్కు లేకపోతే సభ్యుల సంగతేంది?

జెలెన్స్కీ మరణిస్తే.. ఏం చేయాలన్న ప్లాన్ రెడీ