గవర్నర్కే మాట్లాడే దిక్కు లేకపోతే సభ్యుల సంగతేంది?

గవర్నర్కే మాట్లాడే దిక్కు లేకపోతే సభ్యుల సంగతేంది?

గవర్నర్ ప్రసంగంపై చర్చించే  హక్కు సభ్యులకు ఉంటుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.నల్లకండువాలతో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల..  గవర్నర్ బాధ్యతను కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. కేసీఆర్ కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు . గవర్నర్ కే మాట్లాడే దిక్కు లేకపోతే సభ్యుల సంగతేందని ప్రశ్నించారు. కేసీఆర్ సభ్యులను కించపరుస్తున్నారన్నారు. వచ్చే అసెంబ్లీలో ఎగిరేది బీజేపీ జెండానేనన్నారు. సమైక్యాంంధ్రలో కూడా తెలంగాణ తరపున మాట్లాడేందుకు గంటల తరబడి సమయం ఇచ్చారన్నారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోతే బయట మీ సంగతి తేలుస్తామన్నారు. ప్రతీ సమస్యపై అసెంబ్లీలో బీజేపీ పోరాడుతోందన్నారు.

కేసీఆర్ ది హిట్లర్ పాలన అని అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కేసీఆర్ తెలంగాణను అంధకారంలోకి నెట్టిండన్నారు. ఆర్థిక బలంతో అహంకారంతో వ్యవహరిస్తున్నాడని.. గతంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఉండేదన్నారు.  గవర్నర్ తమిళి సైని మహిళా అనే అవమానపరిచారన్నారు.  వచ్చేది బీజేపీ సర్కారే అని అన్నారు.

రాబోయే ఎన్నికల బడ్జెట్ అని అన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇంట్లో నుండే పోలీసులు తమ వాహనాలను డైవర్ట్ చేశారన్నారు. కేసీఆర్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. గవర్నర్ స్పీచ్ తీసేయడం కేసీఆర్ రాజ్యాంగమేనన్నారు.ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే కూడా అడ్డుకుంటున్నారన్నారు.  కేసీఆర్ కు వ్యతిరేకంగా  గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడాలన్నారు. ఆర్ఆర్ఆర్ అసెంబ్లీలో అడుగు పెడుతోందన్నారు.