యుద్ధానికి మరోసారి బ్రేక్

యుద్ధానికి మరోసారి బ్రేక్

కీవ్: ఉక్రెయిన్‌పై కాల్పులు, బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా మరోమారు కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్ తోపాటు ఉక్రెయిన్ లోని ఖర్కీవ్, మరియుపోల్, సుమీ నగరాల్లో కాల్పులను ఆపుతున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయేల్ మక్రాన్ రిక్వెస్ట్ చేయడంతో ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9 గంటల నుంచి (ఇండియన్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి) కాల్పులను తాత్కాలికంగా నిలిపేశామని పేర్కొంది. దీంతో ఆయా నగరాల్లో ఉన్న భారతీయులతో పాటు ఇతర దేశస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. 

ఇప్పటికే ఖర్కీవ్, మరియుపోల్, సుమీల్లో రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. అక్కడ నుంచి విదేశీయులు పశ్చిమ ప్రాంతాలకు వెళ్లి ఉక్రెయిన్ సరిహద్దు దాటే పరిస్థితి లేదు. దీంతో ప్రపంచ దేశాలు మానవతా కారిడార్ ఏర్పాటు చేయాలని రష్యాను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా కాల్పుల విరమణ నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో కూడా రెండు నగరాల్లో ఇలాగే కాల్పుల విరమణ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుమీ ప్రాంతంలో 700 మంది దాకా భారతీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ చెబుతోంది. ప్రస్తుతం కాల్పుల నిర్ణయంతో అక్కడి నుంచి భారతీయులు సురక్షితంగా బయటపడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తల కోసం:

గవర్నర్కే మాట్లాడే దిక్కు లేకపోతే సభ్యుల సంగతేంది?

జెలెన్స్కీ మరణిస్తే.. ఏం చేయాలన్న ప్లాన్ రెడీ