V6 News

గృహజ్యోతి స్కీమ్‌‌కు2,080 కోట్ల సబ్సిడీ : విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్

గృహజ్యోతి స్కీమ్‌‌కు2,080 కోట్ల సబ్సిడీ : విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్
  •     ఉత్తర్వులు జారీ చేసిన విద్యుత్​శాఖ స్పెషల్ ​చీఫ్​ సెక్రటరీ నవీన్​ మిట్టల్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గృహజ్యోతి స్కీమ్​కింద ఫ్రీ కరెంట్ ఉపయోగించే కుటుంబాలకు అందించే సబ్సిడీ కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,080 కోట్ల రాయితీకి బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని విద్యుత్ డిస్కమ్‌‌లకు చెల్లింపులు చేయాలని విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెలా రూ.186.96 కోట్లను డిస్కమ్‌‌లకు ప్రభుత్వం చెల్లించనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

మూడు వేర్వేరు హెడ్ ఆఫ్ అకౌంట్ల ద్వారా ఈ నిధులను హైదరాబాద్‌‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌బీఐ) ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని తెలిపారు. త్రైమాసికాల వారీగా నిధుల వినియోగాన్ని పర్యవేక్షిస్తూ, విధిగా యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గృహజ్యోతి పథకం వల్ల డిస్కమ్‌‌లపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నిధుల విడుదలతో రైతులకు అందించే ఉచిత విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్త పడింది. సబ్సిడీ నిధులను ముందే కేటాయించడం ద్వారా డిస్కమ్‌‌ల నగదు లభ్యత మెరుగుపడుతుంది.