వరద ప్రవాహంలో చిక్కుకున్న కుక్క.. ప్రాణాలకు తెగించిన కాపాడిన పోలీస్

వరద ప్రవాహంలో చిక్కుకున్న కుక్క.. ప్రాణాలకు తెగించిన కాపాడిన పోలీస్

వరద ప్రవాహంలో పొదల్లో చిక్కుకున్న కుక్కను ప్రాణాలకు తెగించిన కాపాడాడో ఓ పోలీస్. వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ లో లోతట్టు ప్రాంతాలు జలయమమవుతున్నాయి.

దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల్ని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.

తాజాగా నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ పరిధి శివారు ప్రాంతంలో వర్షం దాటికి రోడ్లన్ని నీట మునిగిపోతున్నాయి. మూగజీవాలు సైతం వరద దాటికి కొట్టుకుపోతున్నాయి. శివారు ప్రాంతంలో ఓ వరద నీటిలో కుక్క కొట్టుకుపోయింది. చెట్ల పొదల్ని చిక్కుకుని ప్రాణాల్ని కాపాడుకునేందుకు కుక్క ప్రయత్నం చేసింది.

ఘటనపై సమాచారం అందుకున్న నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ముజీబ్..కుక్కను కాపాడేందుకు ఘటనా స్థలానికి జేసీబీతో వచ్చాడు.

వరద దాటికి చెట్ల పొదల్లో ఉన్న కుక్కను కాపాడేందుకు ముజీబ్ సాహసమే చేశాడు. జేసీబీ బకెట్ సాయంతో వరద నీటిలో దిగాడు. ప్రాణాలు తెగించి చెట్ల పొదల్లో ఉన్న కుక్కను సురక్షితంగా బయటకు తీశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతంది.