గ్రూప్ 4కు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) కీలక అప్డేట్ ఇచ్చింది. జూన్ 20వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు గ్రూప్ 4 పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యుల్ కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ తో పాటు తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని అధికారులు తెలిపారు.
కాగా, జూన్ 10వ తేదీన గ్రూప్ 4 మెరిట్ లిస్ట్ విడుదల చేసింది టీజీపీఎస్సీ. తెలంగాణ రాష్ట్రంలో 8 వేల180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మెరిట్ జాబితా ప్రకారం.. 8 వేల130 పోస్టులకు 1: 3 నిష్పత్తిలో అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు పోటీ పడతున్నారు.