హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో బతికి ఉన్న గొర్రెలు, మేకల నుంచి రక్తం తీసి వ్యాపారం చేస్తున్న మాఫియా గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గొర్రె ,మేక రక్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో CNK ల్యాబ్లో సోదాలు జరిగాయి.
హైదరాబాద్ పోలీసులు, స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ టీం సోదాలు చేసింది. కాచిగూడలోని CNK ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో భారీగా రక్త నిల్వలను గుర్తించింది. వెయ్యి లీటర్ల రక్తానికి సంబంధించిన ప్యాకెట్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. రక్తం ప్యాకెట్లను హర్యానాలోని పాలీ మెడికూర్ కంపెనీకి పంపిస్తున్నట్లుగా గుర్తించారు.
►ALSO READ | బీఆర్ఎస్కు అధికారం ఇక కల.. ముందు మీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో: కేటీఆర్కు పొంగులేటి కౌంటర్*
గొర్రె, మేక రక్తంతో ఏమి చేస్తున్నారన్నదానిపై మిస్టరీ కొనసాగుతోంది. ఈ రక్తంతో క్లినికల్ ట్రయల్స్ ఏమైనా చేస్తున్నారనే అనుమానాన్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు వ్యక్తం చేశారు. CNK ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ యజమాని నికేష్ పరారీలో ఉన్నాడు. రెండు రోజులుగా నికేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నికేష్ దొరికితే రక్త సేకరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కీసరలోని నిర్మానుష్య ప్రాంతం నుంచి నికేష్ గొర్రెలు, మేకల రక్తాన్ని తెప్పించుకుంటున్న సంగతి తెలిసిందే.
