ఢిల్లీ: వీధి కుక్కల కేసు కీలక మలుపు తిరిగింది. "కుక్కలు వద్దు... పిల్లులను పెంచండి” అంటూ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎన్వీ అంజారి యాలతో కూడిన బెంచ్ ఈ కేసును విచారిం చింది. వీధుల్లోని అన్ని కుక్కలను తరలించ మని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పింది. కేవలం సంస్థలు, కార్యాలయాల నుంచి మాత్రమే తరలించమన్నామని కోర్టు స్పష్టం చేసింది.
ఎలుకల నియంత్రణలో పిల్లలే మేలు
కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సందీప్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. కుక్కలను పెంచుకునే కంటే పిల్లులను పెంచుకోవాల న్నారు. ఎలుకల నియంత్రణలో పిల్లులు కీలక | పాత్ర పోషిస్తాయని సూచించారు. కాబట్టి కుక్కలకంటే పిల్లులను పెంచేందుకు ప్రోత్స హించాలన్నారు. సీనియర్ అడ్వొకేట్ సీయూ సింగ్ వాదనల సందర్భంగా కుక్కలు లేకపోతే ఎలుకలు, కోతుల సమస్య పెరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ మెహతా.. “కుక్కలు, పిల్లులు పరస్పరం శత్రు వులు.. పిల్లులు, ఎలుకలు బద్ధ శత్రువులు.. వీధుల్లో కుక్కల సంఖ్య తగ్గితే పిల్లుల సంఖ్యపెరుగుతుంది.. అప్పుడు అవి ఎలుకలను తింటాయి కదా” అంటూ సరదాగా వ్యాఖ్యా నించారు...
యానిమల్ బర్త్ కంట్రోల్
వీధి కుక్కల నియంత్రణకు యానిమల్ బర్త్ కంట్రోల్ నియమాలే సరైన మార్గమని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. భారీ సంఖ్యలో కుక్కలను షెల్టర్లలో ఉంచితే వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదముందని హెచ్చరించారు. అయితే ఈ కేసులో తదుపరి వాదనలు రేపు కొనసాగనున్నాయి.
