అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ.. వరుసగా పెరిగిన ధరల నుంచి స్పాట్ మార్కెట్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. దీంతో ఆ ప్రభావం రిటైల్ అమ్మకపు విలువలపై కూడా కనిపిస్తోంది. సేఫ్ హెవెన్ మెటల్స్ కొనాలి లేదా సంక్రాంతి కోసం షాపింగ్ చేయాలి అనుకుంటున్న వ్యక్తులు ముందుగా తమ నగరాల్లో మారిన ధరలను గమనించి నిర్ణయం తీసుకోండి.
తెలుగు రాష్ట్రాల్లో జనవరి 8న బంగారం రేట్లు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో జనవరి 7 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.27 స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 800గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 650గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ఇక వెండి కూడా తన ర్యాలీని ఆపకుండా కొనసాగిస్తూనే ఉంది. సరఫరా సమస్యలతో పాటుగా మరోపక్క అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే గురువారం జనవరి 8, 2025న వెండి రేటు కేజీకి రూ.5వేలు తగ్గుదలను నమోదు చేసి కొనుగోలుదారులను షాక్ కి గురిచేస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 72వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.272 వద్ద ఉంది.
