హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి పెద్దపూర్ నుంచి సింగూర్ వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఫేజ్-3 మెయిన్ పైప్‌లైన్‌లో భారీ లీకేజీలను అరికట్టడానికి అత్యవసర రిపేర్లు చేపట్టనున్నారు. దీంతో పాటు టీఎజీ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 132 కేవీ కంది సబ్‌స్టేషన్ వద్ద పెద్దపూర్ ఫీడర్‌కు సంబంధించి ఏఎంఆర్ టీ టెస్టింగ్, హాట్ లైన్ రిమార్క్స్తోపాటు సాధారణ నిర్వహణ పనులు నిర్వహిస్తారు.
ఈ కారణంగా జనవరి 8న గురువారం ఉదయం 10 గంటల నుంచి 9న శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల వరకు పనులు జరుగుతాయి. దీంతో నగరంలోని ఆయా ప్రాంతాల్లో 18 గంటల పాటు నీటి సరఫరా ఉండదని మెట్రో వాటర్ బోర్డు అధికారులు ప్రకటనలో తెలిపారు.
మలేషియన్ టౌన్షిప్, మాదాపూర్, కొండాపూర్, డోయెన్స్ సెక్షన్, మాదాపూర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, భరత్ నగర్, మూసాపేట సెక్షన్, గాయత్రీ నగర్ సెక్షన్, బాలానగర్ సెక్షన్, కేపీహెచ్‌బీ కొంత భాగం, బాలాజీ నగర్ సెక్షన్ కొంత భాగం, ఫతేనగర్, గోపాల్ నగర్, హఫీజ్‌పేట్ సెక్షన్, మయూరి నగర్, మియాపూర్ సెక్షన్, ప్రగతినగర్ సెక్షన్, మైటాస్, బీహెచ్‌ఈఎల్, ఎంఐజీ-1, 2, రైల్ విహార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, చందానగర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని పేర్కొన్నారు.
