తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు, పోలీసులను ఎక్కడికక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. ఇవాళ జనవరి 8న లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికాడు వరంగల్ కేయూ ఎస్ఐ శ్రీకాంత్ . రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఎస్ఐ శ్రీకాంత్ . పేకాట కేసులో నిందితుడిని లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ శ్రీకాంత్. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్లాన్ వేసి ఎస్ఐని పట్టుకుంది ఏసీబీ.
జనవరి 7 న హైదరాబాద్ బాగ్ అంబర్ పేట్ లో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ను అక్కవరపు కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. బాగ్ అంబర్ పేట్ లోని దేవాదాయ శాఖ తరపున భూమికి చెందిన సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి పట్టుకున్నారు. బాధితుడి నుంచి లక్షా 50 వేలు డిమాండ్ చేసి.. ముందుగా 50 వేల రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
Also Read : సంక్రాంతి ముందు RTA అధికారుల దూకుడు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఒకేసారి ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ సెక్రెటరీలు లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనంగా మారింది. ఎంపీడివో సుమతి, ఎంపీఓ తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య, ఓ భవన నిర్మాణానికి సంబంధించి రూ. లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
శంషాబాద్, నందిగామ గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా పంచాయితీ సెక్రెటరీ, MPDO, MPO లను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ వ్యక్తి నుండి 2.5 లక్షల లంచం డిమాండ్ చేసిన అధికారులు.. మెుదట రూ.1.5 లక్షలు తీసుకుని.. బుధవారం మరో లక్ష రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
