పరిగి/కొడంగల్, వెలుగు: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్య పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాధారంలో శుక్రవారం నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటు ప్రాణాంతక వ్యసనంగా మారి సమాజాన్ని నాశనం చేస్తుందన్నారు.
ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. డ్రగ్స్ అనేది ఒక వ్యవస్థీకృత నేరమని (ఆర్గనైజ్డ్క్రైమ్), ఇది దేశ భవిష్యత్తును దెబ్బతీసే శత్రువుల మారణాయుధమని పేర్కొన్నారు. డ్రగ్స్ వ్యతిరేకంగా కొడంగల్‌లో పోలీస్ శాఖ నిర్వహించిన 2కే రన్‌లోనూ ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జుంబా డ్యాన్స్‌లో పాల్గొని ఉత్సాహం నింపారు.
ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ ఎస్పీలు కృష్ణమూర్తి, రాములు నాయక్, డీఎస్పీ శ్రీనివాస్, ఎక్సైజ్ అధికారులు, మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు.
