జ్యోతిష్యం : మకర రాశి.. జులై నెల .. సమస్యలకు ఉపశమనం.. చర్చల ద్వారా ఆస్తి వివాదాలు పరిష్కారం

జ్యోతిష్యం   :  మకర రాశి.. జులై నెల .. సమస్యలకు ఉపశమనం.. చర్చల ద్వారా ఆస్తి వివాదాలు పరిష్కారం

జూలై నెల మకర రాశి వారికి  వివిధ జీవిత సమస్యలకు పరిష్కారాలను, ఇబ్బందుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఆశించిన ఫలితాలను సాధించడానికి మీరు కఠోర శ్రమ, కృషి చేయవలసి ఉంటుంది. నెల ప్రారంభంలో భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదాలు పరస్పర సంప్రదింపుల ద్వారా లేదా పలుకుబడి ఉన్న వ్యక్తి సహాయంతో పరిష్కరం అవుతాయి. 

తృతీయంలో రాశ్యధిపతి శని, సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా సమయం కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా నెరవేరుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుం టారు. 

పూర్వీకుల ఆస్తిని పొందడానికి అడ్డంకులు తొలగిపోతాయి. జూలై రెండో వారంలో జీతభత్యాలు పొందే ఉద్యోగులు కార్యాలయంలో ప్రత్యర్థుల నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కోవచ్చు. అయినప్పటికీ మీ సీనియర్లు మీకు పూర్తి మద్దతును అందిస్తారు. ఇది అన్ని సవాళ్లను అధిగమించి, చివరికి మీ సత్తాను నిరూపించుకోవడానికి మీకు వీలు కల్పిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు ఈ కాలంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు.

ఉద్యోగ జీవితంలో మీ శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిల కడగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయ మార్గాలు విస్తరి స్తాయి. వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. మిత్రుల సహాయ సహకా రాలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

 మకర రాశి వారికి ఈ నెలలో  సప్తమ స్థానంలోని  గురువు  వ్యక్తిగత మరియు సామాజిక జీవితాన్ని పూలపాన్పులా మారుస్తున్నాడు. మీ మాటకు సమాజంలో ఎక్కడలేని గౌరవం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాశ్యాధిపతి శని తృతీయ స్థానంలో ఉండి, మీలో కొండంత ధైర్యాన్ని నింపుతున్నాడు. అయితే ఇన్ని సానుకూలతలు ఉన్నా, అష్టమ స్థానంలో (8వ ఇల్లు) దాగి ఉన్న కేతువు మీ ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు. ఈ మానసిక ఒత్తిడిని అధిగమిస్తే, వృత్తి వ్యాపారాల్లో మీకు తిరుగులేని విజయాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు.

చేయాల్సిన పరిహారాలు

కేతు పరిహారం (అత్యంత ముఖ్యం): అనవసర భయాలు, నిర్లిప్తత .. ఆత్మన్యూనతా భావం పోవడానికి ప్రతిరోజూ వినాయకుడికి గరికతో పూజ చేసి, గణపతి అథర్వశీర్షం పఠించండి.

 రాహు శాంతి: మాటల్లో కాఠిన్యం పోయి, కుటుంబంలో ప్రశాంతత కోసం శనివారం నాడు దుర్గా దేవికి నిమ్మకాయల దీపం వెలిగించండి .. దుర్గా అష్టోత్తరం చదవండి.

 శివ ఆరాధన: కుజుని ఉద్రిక్తతలు తగ్గి, మానసిక ప్రశాంతత కోసం సోమవారం రోజున శివాలయంలో అభిషేకం చేయించండి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.