సర్పంచులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం : మంత్రి వివేక్ వెంకటస్వామి 

 సర్పంచులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం : మంత్రి వివేక్ వెంకటస్వామి 

ములుగు, వెలుగు: జిల్లాకు చెందిన సర్పంచులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని క్యాంపు ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిద్దిపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొన్యాల బాల్ రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

ప్రజల సేవకు, ప్రజా సంక్షేమం కోసం పరితపించే వ్యక్తిని జిల్లా ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రిగా జిల్లా సర్పంచులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని భరోసా ఇచ్చినట్లు బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. 

నేడు మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 99 రోజుల ప్రణాళికపై రివ్యూ 

మెదక్ :  ప్రజాపాలన 99 రోజుల యాక్షన్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి సమీక్ష శుక్రవారం మెదక్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్నారు. సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరుకానున్నారు