క్యాబ్ డ్రైవర్లకూ రేషన్కార్డులివ్వాలి..తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి

క్యాబ్ డ్రైవర్లకూ రేషన్కార్డులివ్వాలి..తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి

హదరాబాద్​సిటీ, వెలుగు: తెలంగాణలోని క్యాబ్, టాక్సీ, ఓలా, ఉబెర్, రాపిడో, పోర్టర్ వంటి యాప్ ఆధారిత సేవల్లో పని చేసే డ్రైవర్లకు రేషన్​కార్డులు ఇవ్వాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌‌ఫామ్ వర్కర్స్ యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ప్రజా భవన్​లో నిర్వహించిన ప్రజావాణిలో సీఎం  రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

యూనియన్​ అధ్యక్షుడు షేక్​ సలావుద్దీన్​ మాట్లాడుతూ టాక్సీ వాహనం ఉందనే కారణంతో అనేక మంది డ్రైవర్లకు బీపీఎల్ రేషన్ కార్డు దరఖాస్తులను తిరస్కరించారని, దీంతో డ్రైవర్లు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన డ్రైవర్లకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.