సంక్రాంతి పండుగకు ముందు ఆర్టీఏ అధికారులు స్పీడ్ పెంచారు. పండుగ సందర్భంగా నగర వాసులు సొంతూళ్లకు వెళ్లనున్న క్రమంలో బస్సుల సేఫ్టీ, ఫిట్ నెస్ పై తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం (జనవరి 08) సాయంత్రం రాజేంద్ర నగర్ ఆరంఘర్ చౌరస్తా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రైడ్స్ నిర్వహించారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులను గుర్తించి, సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బస్సుల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, బీమా పత్రాలు, పర్మిట్లను అధికారులు పరిశీలించారు.
Also Read : తెలంగాణ వ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్
నిబంధనలు పాటించని కొన్ని బస్సులకు జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ తనిఖీలు కొనసాగుతాయని, చట్టాన్ని ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు.
