హైదరాబాద్ లో బైక్ లో మంటలు.. పెట్రోల్ పట్టించిన కొద్దిసేపటికే..

హైదరాబాద్ లో బైక్ లో మంటలు.. పెట్రోల్ పట్టించిన కొద్దిసేపటికే..

హైదరాబాద్ లో నడుస్తున్న బైక్ లో మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. అప్రమత్తమైన వాహనదారుడు బైక్ ను పార్క్ చేసి ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం ( మార్చి 7 )  జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ లో ఆలివ్ సర్వోదయ హాస్పిటల్ దగ్గర రన్నింగ్ లో ఉన్న బైక్ లో మంటలు చెలరేగాయి. మంటల్లో బైక్ పూర్తిగా దగ్దమైంది. బైక్ లో పెట్రోల్ పోయించిన కాసేపటికే ఘటన చోటు చేసుకుంది.

బైక్ లో మంటలు గమనించిన వాహనదారుడు వెంటనే అప్రమత్తమై బైకును పార్క్ చేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బైక్ పూర్తిగా దగ్దమైంది. ఘటన జరిగిన సమయంలో చుట్టుపక్కల ఉన్న జనం భయబ్రాంతులకు గురయ్యారు. బైక్ లో మంటలు గమనించిన స్థానికులు నీళ్ల పైప్ తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు కానీ.. అప్పటికే బైక్ పూర్తిగా దగ్దమైంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి బైక్ లో లోపమా లేక ఇతర కారణాలేమైన ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.