Good Health : పొన్నగంటి కూరతో  బీపీ కంట్రోల్.. క్యాన్సర్పై పోరాటం..

Good Health : పొన్నగంటి కూరతో  బీపీ కంట్రోల్.. క్యాన్సర్పై పోరాటం..

ఇప్పటి తరానికి చాలా ఆకు కూరలు తెలియవు.  వాటి పేరు చెపితే ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తారు.  అలాంటి వాటిలో పొన్నగంటి కూర ఒకటి. ఈ జనరేషన్​ కు  గోంగూర, పాలకూర, చుక్కకూర.. తోటకూర గురించి తెలిసినంతగా పొన్నగంటి కూర గురించి తెలియక పోవచ్చు. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు ఉన్నాయి.

పొన్నగంటి  కూర తినడం వలన  ఫొలేట్, రైబోఫ్లోవిన్, పోటాషియం, ఇనుము. మెగ్నీషియం లభిస్తాయి. ఈ కూరలో  విటమిన్ ఎ,బి6, సి  విటమిన్లు శరీరానికి అందుతాయి. పొన్నగంటి కూరలో కొలెస్ట్రాల్ శాతం తక్కువుగా ఉంటేంది. 

►ALSO READ | Health Tips : చుండ్రు వేధిస్తుందా.. జట్టును పాడు చేస్తుందా..ఇంటి చిట్కాలతో చుండ్రుకు చెక్..!

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్లు ఈ కూర తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. క్యాన్సర్ పై కూడా ఈ కూర పోరాడుతుంది. ఆస్తమాను నిరోధిస్తుంది. పప్పు, వేపుడు, ఇతర ఆకుకూరలతో కలిపి కూడా దీనిని తీసుకోవచ్చు మూత్రపిండాల సమస్యలతో బాధపడే వాళ్లు దీనిని తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు.