ఇరాన్‌పై దాడి, 12 గంటల్లోనే 900 మిస్సైల్స్.. అమెరికా సైన్యం AIని గట్టిగానే వాడేస్తోందిగా..?

ఇరాన్‌పై దాడి, 12 గంటల్లోనే 900 మిస్సైల్స్.. అమెరికా సైన్యం AIని గట్టిగానే వాడేస్తోందిగా..?

ఇరాన్‌పై జరిగిన భారీ దాడిలో అమెరికా సైన్యం  కృత్రిమ మేధస్సు (AI)ను కీలక ఆయుధంగా వాడుకున్నట్లు తెలుస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 1,000 లక్ష్యాలను గుర్తించి దాడులు చేయడం వెనుక AI టెక్నాలజీ ఉంది. కేవలం 12 గంటల్లోనే సుమారు 900 క్షిపణులను ప్రయోగించడంలో ఈ వ్యవస్థ సైన్యానికి చాలా సహాయపడింది.

మావెన్ స్మార్ట్ సిస్టమ్ అంటే ఏమిటి:
దీనిని అమెరికాలోని పలాంటిర్ టెక్నాలజీస్ అనే సంస్థ తయారు చేసింది. ఇది ఒక రకమైన డేటా బ్రెయిన్  లాంటిది. దీని పనితీరు చూస్తే ఉపగ్రహాలు, డ్రోన్ల ద్వారా వచ్చే వేల కొద్దీ ఫోటోలు, వీడియోలను ఇది సెకన్ల కాలంలోనే విశ్లేషిస్తుంది. అలాగే శత్రువుల స్థావరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి, వాటిలో వేటిపై ముందుగా దాడి చేయాలో సైనిక అధికారులకు సూచనలు ఇస్తుంది.

'క్లాడ్' AI :
ఆంత్రోపిక్ అనే సంస్థ తయారు చేసిన 'క్లాడ్' అనే AI మోడల్ కూడా ఈ ఆపరేషన్‌లో భాగమైంది. ఇది నిఘా సమాచారాన్ని చదివి, ఏ ప్రాంతం యుద్ధ పరంగా ఎంత ముఖ్యమో ఒక వరుస క్రమంలో పెడుతుంది. దాడి జరిగిన తర్వాత ఎంత నష్టం జరిగింది ? ప్లాన్ మార్చుకోవాలా ? అనే విషయాలను కమాండర్లకు వేగంగా వివరిస్తుంది.

ALSO READ : ఇరాన్ అణు పరీక్షలు చేస్తుందా..?

యుద్ధంలో AI :
వేగం: మనుషులు చేయలేని పనిని, అంటే లక్షల కొద్దీ సమాచారాన్ని, విషయాలను  విశ్లేషించి యుద్ధ నిర్ణయాలు తీసుకోవడాన్ని AI చాలా వేగంగా చేస్తుంది. 2025 నాటికి సుమారు 20 వేల మంది అమెరికా సైనికులు ఈ AI వ్యవస్థను వాడుతున్నారు. అంటే ఆధునిక యుద్ధాల్లో  యుద్ధ ట్యాంకులు, విమానాల కంటే డేటాను విశ్లేషించే AI వ్యవస్థలే ఎక్కువ శక్తివంతంగా మారుతున్నాయి.