హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ద్రాక్ష సాగును ప్రోత్సహించడం, రైతుల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా హార్టికల్చర్వర్సిటీ ఆధ్వర్యంలో శనివారం గ్రేప్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్దండా రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
రాజేంద్రనగర్‌లోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, పంటల మార్పిడిలో భాగంగా ద్రాక్ష సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఈ పంటలో మెలకువలను వివరిస్తామని, దిగుబడి, రంగు, నాణ్యత తదితర అంశాలను రైతులు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 59 రకాల ద్రాక్షలను ప్రదర్శిస్తామన్నారు. ఉదయం10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రేప్ఫెస్టివల్ జరుగుతుందని తెలిపారు.
